ఇండియా మరియు జింబాబ్వే ల మధ్యన జరుగుతున్న 3 మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో ఈ రోజు హరారే వేదికగా రెండవ వన్ డే జరగనుంది. ఎన్నో అంచనాలతో ఈ సిరీస్ ను ప్రారంభించిన జింబాబ్వే కు మొదటి మ్యాచ్ లోనే ఓటమి ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు ఇండియన్ స్వింగ్ దెబ్బకు కేవలం 189 పరుగులకే కుప్పకూలింది. దీనితో ఈ మ్యాచ్ లో 10 వికెట్ల ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి కెప్టెన్ చేసిన సవాల్ తో రెండవ మ్యాచ్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ లో మా తడాఖా ఏమిటో చూపిస్తాం అంటూ రెజిస్ చకబ్వా అనడంతో ఇండియా మరియు జింబాబ్వే అభిమానులు ఉత్కంఠగా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే మొదటి మ్యాచ్ లో గెలిచి మంచి ఊపుమీదున్న ఇండియా ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను గెలుచుకోవాలని కాచుకుకూర్చుంది. ఇప్పటికే బౌలింగ్ సైడ్ దీపక్ చాహర్, ప్రసిద్ద కృష్ణ మరియు అక్షర్ పటేల్ లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. వీరికి తమ పొదుపైన బౌలింగ్ తో సిరాజ్ మరియు కుల్దీప్ లు సహకరిస్తున్నారు. ఇక బ్యాటింగ్ లో ఎలాగు ఓపెనర్లు శిఖర్ ధావన్ మరియు శుభమాన్ గిల్ లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఇక వీరి తర్వాత కూడా అద్భుతమైన బ్యాటింగ్ లైన్ అప్ తో ఇండియా జట్టు ఉంది.

ఇక ఇంకాసేపట్లో మొదలు కానున్న రెండవ వన్ డే లో బలమైన ఇండియా ను అడ్డుకుని సిరీస్ లో జింబాబ్వే బోణీ కొడుతుందా ? తన జట్టుపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మొదటి మ్యాచ్ లోలాగా ఇండియా టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకోవడం మంచిది. బ్యాటింగ్ లో తమ బలం ఏమిటో తెలుసుకుండేందుకు అవకాశం మరియు ఆసియా కప్ కు కూడా ప్రాక్టీస్ గా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: