ఇటీవల టీమ్ ఇండియా జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా జట్టు. రెండో మ్యాచ్లో టీమిండియా అదే జోరును కొనసాగిస్తూ ఉందో లేదో అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి సత్తా చాటింది టీమిండియా. పసికూన జింబాబ్వేను జట్టు చిత్తుగా ఓడించి మరోసారి ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా.


 మొన్నటికి మొన్న బంగ్లాదేశ్తో జరిగిన వరుస సిరీస్లలో భారీ స్కోరు చేధించి బంగ్లాదేశ్ జట్టు కు షాకిచ్చింది జింబాబ్వే జట్టు. కానీ టీమిండియాకు మాత్రం కనీస పోటీ ఇవ్వలేక పోయింది అని చెప్పాలి. ఇక రెండో వన్డే మ్యాచ్లో కూడా మరో సారి తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది జింబాబ్వే జట్టు. కనీసం 200 పరుగుల మార్కును కూడా అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది అని చెప్పాలి. 38.1 ఓవర్లలోనే 161 పరుగులు మాత్రమే చేసిన జింబాబ్వే జట్టు చివరి ఆలౌటయి నిరాశపరిచింది. టీమిండియా బౌలర్లు లో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా సిరాజ్, ప్రసిద్ కృష్ణ,  అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఒక వికెట్ తీశారు.


 ఈ క్రమంలోనే జింబాబ్వే జట్టు టీమిండియాపై ఒక చెత్త రికార్డు  మూటగట్టుకుంది. వరుసగా ఐదు వన్డేల లో జింబాబ్వే జట్టు 200 కంటే తక్కువ స్కోర్లు నమోదు చేయడం గమనార్హం. అంతే కాదు ఇందులో రెండు సార్లు 34.3 ఓవర్లలోనే 126 పరుగులు, 42.2 ఓవర్లలో 123 పరుగులు చేసింది. అంటే కనీసం 150 పరుగుల మార్కును కూడా దాటలేదు జింబాబ్వే జట్టు. మరో మూడు సార్లు 200 కంటే తక్కువ స్కోరు చేసింది. 49.5 ఓవర్లలో 168, 43.3 ఓవర్లలో 189 ఇక ఇప్పుడు 161 పరుగులు చేసింది. ఇలా టీమిండియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 161 పరుగులు చేయడం కారణంగా వరుసగా ఐదు వన్డే మ్యాచ్ లలో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టు గా జింబాబ్వే ఒక చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: