కెరీర్ ముగిసిపోయింది ఈ కథను రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయం మరికొన్ని రోజుల్లో కామెంటేటర్గా అతని చూడవచ్చు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ తో తనలో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్మన్ ని అందరికి నిరూపించాడు. ఈక్రమంలోనే టీమిండియాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత జట్టులో ది బెస్ట్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్నాడు అని చెప్పాలి.  ఈ ఏడాది ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.



 ఈ క్రమంలోనే టీమిండియాలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా 37 సంవత్సరాల వయసులో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు దినేష్ కార్తీక్. మాట్లాడుకోవడానికి ఇది సింపుల్ గానే ఉన్నా ప్రాక్టికల్ గా మాత్రం అంత సులువైన విషయం కాదు అనే చెప్పాలి.  సెలెక్టర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెరుపు ఇన్నింగ్స్ తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే దినేష్ కార్తీక్ మళ్లీ టీమిండియా జట్టులో చేరేలా బంగారంలాంటి అవకాశాన్ని ఇచ్చింది మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. తనపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది.


 కోల్కతా నైట్రైడర్స్ జట్టు మెగా వేలంలో కి అతని వదిలేసిన సమయంలో ఎవరూ కూడా దినేష్ కార్తీక్ ను కొనుగోలు చేసేందుకు పెద్దగా మొగ్గు చూపలేదు. ఇలాంటి సమయంలోనే దినేష్ కార్తీక్ ను  జట్టులోకి తీసుకుంది బెంగళూరు యాజమాన్యం. అయితే దినేష్ కార్తీక్ ని జట్టులోకి తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు ఆర్సిబి డైరెక్టర్ మైక్ హెస్సేన్. జట్టులోకి తీసుకునే ముందే దినేష్ కార్తిక్ తో మాట్లాడాను. జట్టులో అతని రోల్ ఏంటి ఎందుకు తీసుకోబోతున్నాడు అన్న విషయాలను గురించి వివరించాము. అందుకే అతని రోల్ ఏంటనే దానిపై దినేష్ క్లారిటీతో ఉన్నాడు.  తప్పులు తను తెలుసుకుంటాడు. ఇక వాటిని రిపీట్  చేయడన్న నమ్మకం కలిగిన తర్వాత అతడిని జట్టులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు మైక్ హెస్సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: