గత కొంత కాలం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. అప్పుడు ఎంతో అలవోకగా పరుగులు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇటీవలికాలంలో మాత్రం ఆ రేంజిలో ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు అనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలోనే కోహ్లీ  అత్యున్నత ఆటగాడు కావడంతో బిసిసిఐ కూడా అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తోంది. అయినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం మునుపటి ఫామ్ అందుకోలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి  ప్రకటించింది బిసిసిఐ. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనలో గాని జింబాబ్వే పర్యటనలో గాని విరాట్ కోహ్లీ పాల్గొనలేదు. ఐతే కొన్నాళ్లు విశ్రాంతి తర్వాత ప్రస్తుతం విరాట్ కోహ్లీ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఆసియా కప్ లో సెలెక్ట్ చేశాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆసియా కప్లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ఉన్నారు.



 ఇక విరాట్ కోహ్లీ తప్పకుండా ఆసియా కప్ లో మునుపటి ఫామ్ అందుకుంటాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఆదివారం ఆసియా కప్లో భాగంగా భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనున్న నేపథ్యంలో ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తప్పకుండా తన మునుపటి అందుకుంటాడు అని భావిస్తున్నాను అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఆసియా కప్ కంటే టి20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ టీమిండియా ఎంతో కీలకమని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రెలియా వేదికగా జరగబోయే వరల్డ్ కప్ లో ఇండియాకు కోహ్లీ అవసరం ఎంతో ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: