ప్రపంచ క్రికెట్ లో అత్యంత ఆసక్తికరమైన.. ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించే మ్యాచ్ ఏది అంటే అందరూ చెప్పేస్తారు అది పాకిస్తాన్ భారత్ మధ్య జరిగే మ్యాచ్ అని. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు కన్నార్పకుండా మ్యాచ్ వీక్షించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను ఏకంగా ఒక ఎమోషన్ అన్నట్లుగానే భావిస్తూ  వుంటారు అని చెప్పాలి. మైదానంలో ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో ప్రత్యర్థి  ఆటగాళ్లతో కాస్తా స్నేహం గానే ఉంటారు.


 కానీ టీవీల వద్ద కూర్చున్న ప్రేక్షకులు మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఎంతో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ గా భావించి వీక్షించడం వంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసియా కప్లో భాగంగా రేపు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే పలువురు మాజీ క్రికెటర్లు ఇదే విషయంపై స్పందిస్తూ ఇరు జట్లకు కూడా తమ ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పలు సూచనలు సలహాలు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ సైతం భారత్ పాకిస్తాన్ వాడబోయే మ్యాచ్ గురించి స్పందించాడు.


 ఈ క్రమంలోనే టీమిండియాను హెచ్చరించాడు. ఎందుకంటే చివరి సారి ఈ రెండు జట్లు ఇదే స్టేడియంలో పోటీ పడిన సమయంలో పది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది ఇండియా. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో పాకిస్తాన్ భారత్ జట్లు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే టీమిండియా మొదటిసారి చిత్తుగా ఓడిపోయింది. ఇదే విషయంపై  పై మాట్లాడిన డానిష్ కనేరియా నాటి పరిస్థితులు రాకుండా రోహిత్ సేనను జాగ్రత్తగా ఉండాలి అంటే చూపించడం ఒకప్పటిలా ఇప్పుడు టీమిండియా ఒత్తిడి లో మునిగి పోకూడదు అంటూ సలహా ఇచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: