ఆఫ్ఘనిస్తాన్ జట్టు నుంచి అత్యుత్తమ స్పిన్నర్ గా ఎదిగింది ఎవరు అంటే ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకులు చెప్పే పేరు రషీద్ ఖాన్ అని. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ గా మాత్రమే కాదు ఐపీఎల్లో ఒక స్టార్ క్లియర్ గా కూడా ఎంతో మందికి ఇతను సుపరిచితుడయ్యాడు. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఇక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవుతూ ఉంటారు. అత్యుత్తమ బ్యాట్స్మన్ లు సైతం ఆచితూచి ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. అంతలా తను స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి.  అయితే బంతి తో మ్యాజిక్ చేయడమే కాదు అవసరమైనప్పుడు బ్యాటింగ్  తో కూడా మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు రషీద్ ఖాన్. ఇప్పుడు వరకు ఐపీఎల్ లో ఎన్నో సార్లు తన బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి.


 ఇకపోతే నేటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ ఎంతో కీలకంగా మారబోతున్నాడు అని తెలుస్తోంది. ఒకవేళ అతడు బాగా కుదురుకున్నాడు అంటే చాలు ఇక శ్రీలంక బ్యాట్స్మెన్ లకు చుక్కలు చూపించటం ఖాయం అని తెలుస్తోంది. ఒకవైపు బౌలింగ్ ప్రాక్టీస్ లో మునిగితేలిన రషీద్ఖాన్ మరోవైపు బ్యాటింగ్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇటీవలే రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లు ఆడుతున్న  వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 బౌలింగ్లో వికెట్ల తీయడమే కాదు జట్టుకు అవసరమైతే బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడానికి కూడా నేను సిద్ధమే అన్నట్లుగా ప్రస్తుతం ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాడు రషీద్ ఖాన్. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా రషీద్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో చూసుకుంటే రషీద్ఖాన్ కనుగొన్న స్నేక్ షాట్ కూడా ఆడాడు అనేది తెలుస్తుంది. గేమ్ డే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కు అంతా సిద్ధమైంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు రషీద్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: