ఒకప్పుడు కేవలం మేల్ క్రికెటర్స్ మాత్రమే రికార్డులు కొల్లగొడుతూ అద్భుతమైన ప్రదర్శన చేసే వాళ్ళు అని ఒక భావన ఉండేది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఫిమేల్ క్రికెటర్స్ కూడా అదిరిపోయే ప్రదర్శనతో తాము పురుష క్రికెటర్లకు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా పురుష క్రికెటర్లకు ఎంతో అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫార్మాట్ తో సంబంధం లేకుండా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వెస్టిండీస్ లో 60 బంతుల టోర్నీ జరుగుతుంది. మహిళలు పురుషుల విభాగంలో ఏకకాలంలో టోర్ని నిర్వహిస్తుండటం గమనార్హం.


 ఈ 60 బంతుల్లో టోర్నీలో భాగంగా ఇటీవల ఒక అద్భుతమైన రికార్డు నమోదయింది. అమెరికాకు చెందిన గీతిక కొడలి ఇటీవలే హ్యాట్రిక్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది అని చెప్పాలి. సెయింట్ కిట్స్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ వర్సెస్ బార్బడోస్ రాయల్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ట్రిన్ బాగో జట్టు గెలిచింది. అయితే ఈ విషయానికి గీతిక ప్రధాన కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.



 ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగింది బార్బడోస్ జట్టు. ఐదు వికెట్ల నష్టానికి కేవలం 63 పరుగులు మాత్రమే చేసి ఇరవై మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. శుభారంభం అవసరమైన సమయంలో తొలి ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే చేసింది. కానీ రెండో ఓవర్లో గీతిక వరుసగా హ్యాట్రిక్ సాధించింది. దీంతో అందరు బ్యాటర్ లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఇలా ఈ టోర్నమెంట్లో మహిళల విభాగంలో హ్యాట్రిక్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా గీతిక అరుదైన రికార్డును సృష్టించింది. తన జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: