ఇటీవలే ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ప్రతి బంతికి ఎలాంటి అద్భుతం జరుగుతుంది అన్నది కన్నార్పకుండా చూసారు ప్రేక్షకులు. ఇక ప్రతి ఒక్కరిని కూడా మునివేళ్ళపై నిలబెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇరుజట్లు బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఇక ఎంతో ఉత్కంఠభరితమైన పోరులో చివరిలో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో చివరికి టీమిండియా జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


ఈ ఏడాదికి 20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ భారత్ ను ఓడించగా ఇక ఇప్పుడు ఆసియా కప్లో ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్తో మ్యాచ్ గెలవడంతో టీమిండియా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరు మాత్రం అందరిని పూర్తిగా నిరాశపరిచింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత కె.ఎల్.రాహుల్ అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నప్పటికీ మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు కేఎల్ రాహుల్.



 బంతిని అంచనా వేయడంలో పొరబడినా కె.ఎల్.రాహుల్ వికెట్ల మీదకు బంతిని ఆడి చివరికి మూల్యం చెల్లించుకున్నాడు. ఈసారి ఎలాగైనా పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ ప్రగల్భాలు పలికిన కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు అని చెప్పాలి. పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన యువ బౌలర్ నసీం షా  వేసిన తొలి ఓవర్లోనే రాహుల్ క్లీన్బౌల్డ్ అయ్యాడు అని చెప్పాలి. అయితే  టి 20 క్రికెట్ లో డబ్ల్యూ మ్యాచ్ ఆడుతున్న నసీం షాకు ఇదే తొలి గోల్డెన్ డక్ వికెట్ కావడం గమనార్హం. రాహుల్ అవుట్ అయిన విధానం చూస్తే గత ఏడాది టి 20 ప్రపంచకప్లో షాహీన్ అఫ్రిది బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిన సీన్ మరోసారి గుర్తుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: