నిన్న అజాత శత్రువులు ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన ఆసియా కప్ టోర్నీలో రెండవ లీగ్ మ్యాచ్ జరిగింది. మొదటి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక లాంటి బలమైన జట్టును పసికూన ఆఫ్ఘనిస్తాన్ దారుణంగా ఓడించింది. దీనితో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫేవరెట్ అయిపోయింది. ఇది గ్రూప్ బి లో ఉన్న జట్ల పరిస్థితి, కాగా గ్రూప్ ఏ లో ఇండియా , పాకిస్తాన్ మరియు హాంగ్ కాంగ్ లు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో నిన్న హోరా హోరీగా మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచినా ఇండియా పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే ముందుగా క్రికెట్ విశ్లేషకులు ఊహించిన విధంగానే పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఏమంత పసలేదు.

చివర్లో బౌలర్ దహని కనుక రెండు సిక్సర్లు కొట్టకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అలా కష్టాలు పడి పాకిస్తాన్ 19 .5 ఓవర్లలో 147 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇండియా కున్న బ్యాటింగ్ ఆర్డర్ ను చూసి ఎవరైనా ఈ పరుగులను సునాయాసంగా ఛేదిస్తుంది అని అనుకుంటారు. కానీ దీనికి కూడా ఆఖరి ఓవర్ నాలుగవ బంతి వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ రాహుల్ లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కోహ్లీ మాత్రం ఉన్నంతసేపు నిదానంగా ఆడి ఫామ్ ను తిరిగి తెచ్చుకున్నాడు. కానీ 35 పరుగులు మాత్రమే చేశాడు. ఇక సెకండ్ డౌన్ గా ప్రమోషన్ పొందిన జడేజా సైతం నెమ్మదిగా ఆడి వికెట్ పడకుండా జట్టును సేఫ్ చేశాడు.

అయితే ఆఖరి ఓవర్ లో ఒక డ్రామా జరిగింది , 7 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులో జడేజా మరియు హార్దిక్ లు ఉన్నారు. మహమ్మద్ నవాజ్ వేసిన మొదటి బంతి డాట్ అయింది. రెండవ బంతికి అనవసర షాట్ కు ప్రయత్నించి జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో 4 బంతులకు 6 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. మూడవ బంతికి కార్తీక్ ఫైన్ లెగ్ లో సింగల్ తీశాడు. ఇక మిగిలింది మూడు బంతులు కావాల్సింది 6 పరుగులు... అందరిలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. హార్దిక్ ఆ తర్వాత బంతిని డాట్ చేశాడు. ఇక రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి రావడంతో ఇండియా అభిమానుల్లో తీవ్ర టెన్షన్ వచ్చింది. ఈ దశలో నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న దినేష్ కార్తీక్ హార్దిక్ ను ఉద్దేశించి ఏదో అనగా, దానికి హార్దిక్ ఒక చిన్న సిగ్నల్ ఇచ్చాడు. నేనున్నాను ఏమి భయం లేదు అంటూ తన ధీమాను వ్యక్తం చేశాడు. చూపిన విధంగానే ఆ తర్వాత బంతిని లాంగ్ ఆన్ దిశగా సిక్సర్ ను సంధించి మ్యాచ్ ను ముగించాడు. అందుకే క్రీజులో హార్దిక్ ఉన్నాడంటే టార్గెట్ ఎంతయినా కరిగిపోవాల్సిందే.  



 


మరింత సమాచారం తెలుసుకోండి: