ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో టీమ్ ఇండియా జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య 17 బంతుల్లో 35 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇక టీమిండియా విజయం తథ్యం గా మారిపోయింది. ఇక టీమిండియా అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కూడా తిరుగులేని ప్రదర్శన చేయడంతో రోహిత్ సేన పాకిస్థాన్ ను చిత్తు చేసింది అని చెప్పాలి. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టార్గెట్ చేధించింది.


 ఇక గత ఏడాది పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి ఇక ఇప్పుడు ఆసియా కప్లో భాగంగా భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పాలి. ఇక ఈ విజయంతో మరో సారి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీ మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.  కొన్ని కారణాలు చూస్తే కోహ్లీ కంటే రోహిత్ కెప్టెన్సీ బెటర్ అనేలా ఉన్నాయి అన్నది ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది.

1. ఇప్పటివరకు టాస్ గెలవడం విషయంలో రోహిత్ శర్మ బీభత్సమైన అదృష్టం కలిసివచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో 99.9 శాతం రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. మైదానంలోనీ పరిస్థితులకనుగుణంగా బ్యాటింగ్ ఫీల్డింగ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే గెలుపును టాస్ కూడా నిర్ణయిస్తుంది అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీ మాత్రం ఎప్పుడూ టాస్ ఓడిపోతూ ఉండేవాడు. గత ఏడాది  టీ20 ప్రపంచకప్ లో కూడా టాస్ ఓడిపోవడం గమనార్హం.


 రోహిత్ ఎప్పుడూ తన జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటాడు. ఒకప్పుడు ఐపీఎల్లో అయిన ఇక ఇప్పుడు టీమిండియా తరఫున అయినా ఆరవ బౌలర్ ను అందుబాటులో ఉంచుకుంటాడు. ఉదాహరణకు నిన్నటి మ్యాచ్ లో రోహిత్ ఆవేశ్ ఖాన్ ను ఆరో బౌలర్ గా తీసుకున్నాడు.  కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాడు అని చెప్పాలి.


 విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు బ్యాటింగ్ విభాగం  రోహిత్ కె.ఎల్.రాహుల్ కోహ్లీ పైన ఆధారపడుతూ ఉండేది. ముగ్గురు విఫలమైతే భారత్ కి ఓటమి ఖాయం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ముగ్గురు బ్యాట్స్ మెన్ లతో  పాటు ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తున్నారు. రిషబ్ పంత్ హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా లాంటివారు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ లాగా దంచి కొడుతున్నారు.


 మైదానంలో రోహిత్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఆట పరిస్థితి ఏంటి అన్నది బాగా రీడ్ చేస్తాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ పెడతాడు. ప్రయోగాత్మక  నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతాడు. కోహ్లీ టీం ప్లాన్ అమలు చేయడం పైనే దృష్టి పెడతాడు. కొత్త నిర్ణయం తీసుకోవడంలో తడబడుతూ ఉంటాడు. అదే సమయంలో చిన్న విషయానికి కూడా అగ్రసీవ్ గా స్పందిస్తూ ఉండేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: