ఇటీవలే ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇందుకు సంబంధించిన చర్చ అంతే హాట్హాట్గా జరుగుతుంది అని చెప్పాలి. ఎంతోమంది మాజీ క్రికెటర్లు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మంచి ప్రదర్శన చేసిన టీమిండియా బ్యాట్స్మెన్ పై భారత మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండటం గమనార్హం.


 ముఖ్యంగా మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతున్న సమయంలో క్రీజులోకి వచ్చాడు హార్థిక్ పాండ్య. అలాంటి సమయంలో భారత్ ముందు చిన్న టార్గెట్ ఉన్నప్పటికీ బంతులు మాత్రం తక్కువ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒత్తిడిని కూడా చిత్తు చేస్తూ ఎంతో కూల్గా భారీ షాట్లు ఆడాడు హార్థిక్ పాండ్య. ఈ క్రమంలోనే ఎంతో ఆత్మ విశ్వాసంతో కనిపించాడు అనే చెప్పాలి. ఇక రెండు బంతుల్లో నాలుగు పరుగులు కావాల్సిన గణాంకాలు ఉన్న సమయంలో సిక్సర్ కొట్టి తన గురువు ధోని స్టైల్ లో మ్యాచ్ను ముగించేశాడు అని చెప్పారు. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ పై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ.


 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందిస్తూ హార్దిక్ పాండ్యా ఆటతీరు మహేంద్ర సింగ్ ధోనీ ని గుర్తు చేసింది అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఉతప్ప. 2016 అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన హార్దిక్ పాండ్యాకు ధోని అండగా నిలిచాడని గుర్తుచేశాడు. వారిద్దరూ మంచి స్నేహితులని..  పాండ్య ఒక మంచి క్రికెటర్గా ఎదగడం లో ధోనీ పాత్ర ఎంతో కీలకమైనది అంటూ తెలిపాడు. ఇప్పుడు ధోని ఆటతీరు హార్దిక్ పాండ్యా లో  కనిపిస్తుంది అంటూ తెలిపాడు.  ఇక ఇదే ఫామ్ను కొనసాగిస్తే మాత్రం హార్దిక్ ను పాండ్యా నాయకత్వ పాత్ర లో చూస్తామంటూ రాబిన్ ఊతప్ప వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: