ప్రస్తుతం మిని ప్రపంచ కప్ గా పిలువబడే ఆసియా కప్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భాగంగా ఇటీవలే నేడు మరో ఆసక్తికరమైన పోరు జరిగేందుకు అంతా సిద్ధమైంది. బంగ్లాదేశ్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది. గ్రూపు బి లో ఉన్న షకీబ్ ఉల్ హాసన్ బృందం.. అదే గ్రూపులో ఉన్న ఆప్ఘనిస్థాన్ జట్టుతో షార్జా వేదికగా హోరాహోరీగా తలపడేందుకు సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్లో భాగంగా ఇప్పటికే మొదటి మ్యాచ్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంక జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించి మట్టికరిపించింది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.


 అటు బంగ్లాదేశ్ జట్టు మాత్రం వెస్టిండీస్ జింబాబ్వే పర్యటనలో పరాభవాల తర్వాత ఇక ఇపుడు ఆసియా కప్ టోర్నీలో ఆడేందుకు  సిద్ధమైంది.. ఈ క్రమంలోనే ఎవరు విజయం సాధిస్తారో అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ లో విజేత ఎవరు అన్న విషయాన్ని తేల్చేసాడు.



 ఇక ఇరు జట్ల బలాబలాలు విజయావకాశాలపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అభిప్రాయం పంచుకున్నాడు. బంగ్లాదేశ్ అసలు గెలిచే ఛాన్స్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. జింబాబ్వే బ్యాటర్ అయినా సికిందర్ రాజా బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డేలలో పర్వాలేదు. కానీ టి-20లో వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఒకవేళ షార్జా పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే ఎక్కువ పరుగులు రాబట్టే  అవకాశం లేకపోతే  ఇక బంగ్లాదేశ్ విజయావకాశాలు కాస్త మెరుగుపడతాయి. అంతే కాకుండా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమిస్తే గట్టిపోటీ ఇవ్వగలుగుతారు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: