వ్యక్తిగత ప్రదర్శన విషయంలోనే కాదు అటు కెప్టెన్సీ విషయంలో రోహిత్ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు అనే చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఇండియాకు తన వ్యూహాలతో వరుస విజయాలు అందిస్తూ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా చెరగని ముద్రవేసుకున్నాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తిరుగులేని విజయాలను సాధిస్తుంది టీమిండియా. ఏ దేశ పర్యటనకు వెళ్లినా అక్కడ ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తూ వరుసగా సిరీస్ లలో విజయఢంకా మోగిస్తోంది. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్ పై మరోసారి ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా.


 ఆసియా కప్ లో పాకిస్తాన్ పై విజయం తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఒక అరుదైన రికార్డు చేరిపోయింది. అంతర్జాతీయ టీ20ల్లో 30 లేదా అంత కంటే ఎక్కువ మ్యాచ్లలో  విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు రోహిత్ శర్మ. అంతేకాదండోయ్ ఇక 30 విజయాలు అందించిన కెప్టెన్గా  అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ కలిగిన సారథిగా కూడా రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 36 మ్యాచ్లు ఆడింది. 36 మ్యాచ్ లలో 30 విజయాలు సాధించింది అని చెప్పాలి. అంటే విన్నింగ్ పెర్సెంటేజ్ 83.33 గా ఉంది. కేవలం ఆరు మ్యాచ్ లు మాత్రమే రోహిత్ సారథ్యంలో టీమిండియా ఓడిపోయింది.


 దీంతో 30 విజయాలు సాధించిన కెప్టెన్లలో అత్యధిక విన్నింగ్ పెర్సెంటేజ్ ఉన్న సారథిగా రోహిత్ శర్మ ప్రస్తుతం టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ కెప్టెన్ అగర్ ఆఫ్ఘన్  ఉండటం  గమనార్హం. అతని విజయాల శాతం 80.8 గా ఉంది. తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 62.5 శాతం, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 59.2 శాతం, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 58.6%, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 55.6%, న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 51.7% విన్నింగ్ పర్సంటేజ్ కలిగి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: