మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లు  అందించాడు అన్న విషయం ప్రతి ఒక్కరికీ ప్రేక్షకుడికి తెలుసు. కానీ వరల్డ్ కప్ సమయంలో ధోని  టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తే ఇక ఆ వరల్డ్ కప్ భారత వశం కావడానికి కీలక పాత్ర పోషించింది అదిరిపోయే బ్యాటింగ్తో  టీమిండియాకు విజయాలను అందించింది మాత్రం గౌతం గంభీర్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి టీమిండియాకు ఓపెనర్ గా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ టీమిండియాకు ఎన్నో అద్వితీయమైన విజయాలను అందించిన ఘనత గౌతం గంభీర్కు దక్కుతుంది. ఇలాంటి గౌతం గంభీర్ పై ఇటీవలే షాహీన్ అఫ్రిది షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 అయితే తన సహచర ఆటగాడు పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి  హర్భజన్ సింగ్ మాత్రం చిరునవ్వులు చిందించటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగానే గౌతం గంభీర్ కి కాస్త దూకుడెక్కువ. అలాంటిది పాకిస్తాన్ మ్యాచ్ అంటే మరింత ఆవేశపరుడు గా కనిపిస్తాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో  కాస్త దురుసుగా ప్రవర్తించేది మాజీ క్రికెటర్ షాహీన్ అఫ్రిది, షోయబ్ అక్తర్. ఇక ఇద్దరికీ గౌతం గంభీర్ కి అస్సలు పడేది కాదు.  పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది అంటే పాకిస్థాన్ క్రికెటర్ గౌతం గంభీర్ కి తప్పక గొడవలు జరుగుతూ ఉండేవి.



 అయితే ఆన్ ఫీల్డ్ లోనే కాదు ఆఫ్ ఫీల్డ్ లో కూడా షాహిద్ అఫ్రిది మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలు అలాగే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల గౌతం గంభీర్ పై షాహిద్ అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నేను చాలా మంది భారత క్రికెటర్లు తో గొడవ పడ్డా.. అయితే ఆన్ ఫీల్డ్  వరకు మాత్రం ఉండేది. కొన్ని సార్లు గౌతం గంభీర్ సోషల్ మీడియాలో కూడా చిన్నచిన్న గొడవలు జరిగాయి. నాకు తెలిసి గౌతం గంభీర్ అంటే భారత క్రికెట్లో కూడా ఎవరికి నచ్చదు అనుకుంటా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  అయితే షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై స్పందించిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్  ఇక ఆ వ్యాఖ్యలపై ఒక చిరునవ్వు వదిలేశాడు. ఇది తీవ్ర దుమారం గా మారిపోయింది. సహచర ఆటగాడు పై పాకిస్థాన్ క్రికెటర్ విమర్శలు చేస్తే దాని ఖండించవలసింది పోయి పరోక్షంగా అంగీకరిస్తావా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: