భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్ మ్యాచ్ అని పిలుస్తూ ఉంటారు అందరూ. దాయాదుల సమరం లో ఎవరు గెలిచినా కూడా అది ఒక ఎమోషన్తో కూడుకున్నది అని చెబుతూ ఉంటారు. అయితే అటు భారత క్రికెటర్లకు పాకిస్తాన్ లో కూడా వీరాభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ అభిమానాన్ని మనసులోని దాచుకోకుండా బహిరంగంగా కూడా ప్రదర్శిస్తూ ఉంటారు.  ఇక ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో ఏకంగా  ఒక పాకిస్తాన్ అభిమాని కోహ్లీ పేరు ఉన్న జెర్సీ ధరించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు కొందరు కెప్టెన్ రోహిత్ శర్మను  కలిసి సంబరపడిపోయారు.


 పాకిస్తాన్ కెప్టెన్ బాబర్  దగ్గర్నుంచి వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్  వంటి క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీ కి వీరాభిమానులు  అన్న విషయం తెలిసిందే. ఈ విషయాలు ఎవరో  చెప్పడం కాదు ఇక ఆ క్రికెటర్లు స్వయంగా వెల్లడించారు. ఇటీవలే పాకిస్తాన్ బౌలర్ హరీష్ రౌఫ్  విరాట్ కోహ్లీ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆసియా కప్ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడాడు.   అంతేకాదు ఇక విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీని తీసుకొని ఎంతగానో సంబరపడిపోయాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో  ఐసీసీ తమ సోషల్ మీడియా ఖాతాలో  పోస్ట్ చేయగా ఇక ఎమ్మెస్ ధోనీ పేరు కూడా వార్తల్లోకి వచ్చింది అని చెప్పాలి.


 గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియాపై తొలిసారి విజయాన్ని సాధించింది పాకిస్థాన్ జట్టు.  ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం అప్పుడు టీమిండియాకు మెంటార్ గా  ఉన్న మహేంద్ర సింగ్ ధోనీని  కలిశాడు ఇదే హరీష్ రౌఫ్.   ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీని కానుకగా ఇవ్వాలని కోరాడు.  టీమ్ ఇండియా జెర్సీ  కాకుండా సీఎస్కే జెర్సీ కావాలని కోరాడు. ఈ క్రమంలోనే అతని కోరిక నెరవేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ  అతనికి కానుకగా ఇచ్చాడు.  ఇక ఇదంతా చూసిన తర్వాత పాకిస్తాన్ ప్రేక్షకులకు క్రికెటర్లకు భారత క్రికెటర్లపై   ఇంత అభిమానం ఎందుకో  అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: