ఇటీవల ఎక్కడ చూసిన వార్తల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. ఇటీవలే పాకిస్థాన్పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ తో మాత్రమే కాదు అంతకు ముందు టీమిండియా తరపున ఆడిన ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో  అతను హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే హార్థిక్ పాండ్యా ఎప్పుడూ తన గురువు మహేంద్ర సింగ్ ధోనీ పట్ల గౌరవాన్ని  వ్యక్త  పరుస్తూనే ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే తన కెరియర్ గురించి కెరీర్లో ఎదిగిన తీరు గురించి ఒక క్రీడా ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా.  కెరియర్ ఎదుగుదలలో మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని మరోసారి గుర్తు చేసుకున్నాడు.


 నేను నా కెరీర్లో.. క్రికెట్ లో ఎదుగుతున్న సమయంలో మహేంద్రసింగ్ ధోని ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే క్రికెట్లో ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నేను ధోనీని ఎక్కువగా పరిశీలిస్తూ ఉండేవాడిని..  ఎన్నో విషయాలను కూడా అతని నుంచి నేర్చుకున్నాను అంటూ హార్దిక్  చెప్పుకొచ్చాడు. ధోనీ  మైండ్ సెట్ నాలెడ్జ్ ను  తరచు గమనిస్తూ ఉండేవాడిని..  అందుకే కావొచ్చు నా వ్యక్తిత్వంలో కూడా ధోని లక్షణాలు ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. బాధ్యతలు  తీసుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటానని.. తప్పులు అవకాశాలు ఏవైనా సరే సొంతం చేసుకుంటా  అంటూ చెప్పుకొచ్చాడు.


 కొన్ని సార్లు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. జట్టులో  నా పాత్ర ఏంటనేది నా వైఫల్యం కారణంగానే తెలుసుకోగలిగాను. ఇప్పటికీ కూడా నేను నేర్చుకునే దశలోనే ఉన్నా.అది లోయర్ ఆర్డర్ నుంచి మంచి ఫినిషింగ్  ఇచ్చే  ఆటగాడు ఉండాలని హార్థిక్ పాండ్య  అన్నాడు. రెస్టారెంట్ కు  వెళ్ళినప్పుడు ఆహారం ఎంత బాగున్నా  ఫినిషింగ్ టచ్ లేకపోతే బాగుండదు. అలాగే మ్యాచ్లో కూడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: