ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేస్తున్న ప్రయోగాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి  అని చెప్పాలి. నిన్నటి వరకు వివిధ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ల సమయంలో జట్టులో పలువురు ఆటగాళ్లను  మారుస్తూ ప్రయోగాలు చేశాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు ఆసియా కప్ లో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే పాకిస్తాన్తో మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్యా ని పక్కన పెట్టి  రిషబ్ పంత్ కు   జట్టులో  అవకాశం కల్పించాడు అన్న విషయం తెలిసిందే.


 ఇలా అద్భుతమైన ఫామ్లో ఉన్న హార్దిక్ పాండ్య ని పక్కన పెట్టడం పై అందరూ ఆశ్చర్యపోయారు. కాగా  ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు గౌతం గంభీర్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పు పట్టాడు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అర్థం పర్థం లేనిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా కు బదులు దినేష్ కార్తీక్ ని పక్కన పెట్టాల్సింది  అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలి  అనుకుంటే అతని స్థానంలో దీపక్ హుడాను  తీసుకోవాల్సింది అంటూ  అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టు  మేనేజ్మెంట్ ఉద్దేశం ఏంటి అన్నది మాత్రం తనకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 హార్దిక్ పాండ్యా జట్టులో  లేకపోవడం వల్ల భారత జట్టుకు ఒక బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది అంటూ చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం ఆసియా కప్ లో హిందీ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ మ్యాచ్కి ముందు జరిగిన ప్రీ మ్యాచ్ షోలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే అటు టీమిండియా అభిమానులు సైతం రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఉండడం గమనార్హం. కేఎల్ రాహుల్ ని పక్కనపెట్టి రిషబ్ పంత్ తో  ఓపెనింగ్ చేయించాలని ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు. అంతేకాదు హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ హుడాకు ఛాన్స్ ఇవ్వాలి అని అంటూ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: