ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా భారత్ హాంగ్కాంగ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిన భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత్ తో మ్యాచ్ అనంతరం మాట్లాడిన హాంకాంగ్ ఆటగాళ్లు ఎన్నో  రోజుల తర్వాత టీమిండియాతో మ్యాచ్ ఆడటం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము  అంటూ తెలిపారు. అయితే ఇక హాంకాంగ్ తో  మ్యాచ్ ముగిసిన తరువాత ఇటీవలే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో అద్భుత దృశ్యాలు దర్శనమిచ్చాయి.


 హాంకాంగ్ జట్టు ఆటగాళ్లు అందరూ కూడా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సందర్శనకు రావడం గమనార్హం.  ఈ క్రమంలోనే అక్కడే ఎంతగానో అనుభవజ్ఞులతో సంభాషణలు, క్రికెట్ ఆటకు సంబంధించిన పాఠాలు,  మరపురాని ముచ్చట్లు ఎన్నో జ్ఞాపకాలు హాంకాంగ్ ఆటగాళ్లకు మిగిలిపోయాయి అని చెప్పాలి. హాంకాంగ్  ఆటగాళ్లు భారత డ్రెస్సింగ్  రూమ్ సందర్శనకు వచ్చిన వీడియో ని బిసిసీసీ  ఇటీవల ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక భారత డ్రెస్సింగ్ రూమ్  కు  వచ్చినా హాంకాంగ్ ఆటగాళ్ళతో టీమిండియా ఆటగాళ్లు సరదాగా ముచ్చటించారు.


 ఈ క్రమంలోనే అందరూ కలిసి సెల్ఫీలు దిగారు.  అంతేకాకుండా ఆటోగ్రాఫులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరితో ఒకరు ఎంతో ఆత్మీయంగా సంభాషించు ఉన్నారు. హాంకాంగ్ ఆటగాళ్లు  టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ పర్యటనకు రావడంతో ఇక ఆ  వేదిక ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  అంతకు  ముందు విరాట్ కోహ్లీకి  హాంకాంగ్ జట్టు మంచి  బహుమతి ఇచ్చింది. తమ జట్టు సభ్యులు అందరూ కలిసి సంతకాలు చేసిన జెర్సీ  ఇచ్చారు. కోహ్లీ  ఒక తరానికి కానుకగా నిలిచాడని.. ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటామని వ్రాశారు. రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి అంటూ సందేశాన్ని కూడా జెర్సీ పై  చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: