ఇటీవల కాలంలో ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఎంతోమంది మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉంటే జాతీయ జట్టులో వరుసగా అవకాశాలు అందుకుంటున్న అవేశ్ ఖాన్  మాత్రం పేలవ  ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.  భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇలాంటి సమయంలో అతని పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి టీం ఇండియా  యాజమాన్యం కూడా అతన్నీ  పక్కన పెట్టే అవకాశం ఉంది అని అందరూ భావిస్తూ ఉన్నారు.


 ఇలాంటి సమయంలో అతను భారీగా పరుగులు సమర్పించుకున్న ఇంకా అతన్నీ  జట్టులో కొనసాగించమేంటి  అని  ఇటీవల టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ రోహన్ గవాస్కర్ టీమిండియా యాజమాన్యం పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇటీవలే హాంకాంగ్ బ్యాట్స్మెన్లను కూడా కట్టడి చేయలేకపోయిన అవేశ్ ఖాన్  53 పరుగులు ఇచ్చాడు.  ఇక ఇదే విషయంపై స్పందిస్తూ టి20 ప్రపంచ కప్ సమయం వరకు కూడా ఆవేశ్  ఖాన్  తన ప్రదర్శన మెరుగుపరుచుకుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో ఎలాంటి సందేహం కూడా లేదు.


 ఇక అవేశ్ ఖాన్  ఇప్పటివరకు చేసిన దాని గురించి పట్టించుకోను. ఒక విషయం మాత్రం చెప్పగలను. సెలెక్టర్ల  మనసులో ఏముందో తెలియదు. కానీ చాలా మంది అనుకుంటుందే  నేను చెబుతున్నాను. అవేశ్ ఖాన్  టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్  కి సరిపోడు  అంటూ చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.   టి20 ప్రపంచకప్ సమయానికి ఎలాగో రోహిత్ శర్మ జట్టులోకి వస్తాడు. అవేశ్ ఖాన్ కు బదులు  దీపక్ చాహర్, హర్షల్ పటేల్  లాంటి వారికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. 9.10 ఎకనామి ఉన్నప్పటికీ కూడా అతనికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి అంటూ రోహన్  గవాస్కర్  వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: