విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ తో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ విమర్శలు అన్నింటికీ ఇటీవల తన బ్యాట్  తోనే  సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యాడు అన్నట్లుగానే కనిపించాడు. ఎన్నో రోజుల నుంచి ఫామ్  లేక ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్ తో  ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన  విరాట్ కోహ్లీ అటు హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులు చేసి ఇక దాదాపు ఆరు నెలల తర్వాత హాఫ్ సెంచరీతో అభిమానులందరి లో కొత్త ఊపిరి నింపాడు అని చెప్పాలి.


 అదే సమయంలో ఇప్పుడు మరోసారి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవబోతుంది అన్న విషయం తెలిసిందే. కోహ్లీ పరుగుల పరంగా సెంచరీ చేయలేక పోయినప్పటికీ మ్యాచ్ ల పరంగా  ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వందవ మ్యాచ్  ఆడి సెంచరీ చేశాడు అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు పరుగుల పరంగా సెంచరీ చేస్తాడో లేదో తెలియదు కానీ సిక్సర్ల పరంగా  మాత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు విరాట్ కోహ్లీ.


 ఇప్పటికే ఎన్నో రికార్డులను అలవోకగా ఛేదించిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధమయ్యాడు.  ఈ క్రమంలోనే మరో మూడు సిక్సర్లు కొడితే టి20లో వంద సిక్సర్లు  కొట్టిన రెండవ భారత బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించబోతున్నాడు  విరాట్ కోహ్లీ. అయితే ఈ జాబితాలో రోహిత్ శర్మ 165 సిక్సర్లతో తొలిస్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. కాగా విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ టి20 కెరీర్లో ఇప్పటివరకు 97 సిక్సర్లు కొట్టాడు. మరో మూడు సిక్సర్లు కొట్టాడు అంటే టి-20లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆటగాడిగా సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా  నిలుస్తాడు. పాకిస్థాన్తో నేడు జరగబోయే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎలా  రాణించబోతున్నాడు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: