గత కొంత కాలం నుంచి టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఎంత పేలవమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే అతని పేలవ  ప్రదర్శనకు ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తూ  ఉన్నారు. అయితే కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇటీవల మళ్లీ ఆసియా కప్లో భాగంగా జట్టుతో చేరాడు. ఈ క్రమంలోనే కాస్త టచ్ లోకి వచ్చినట్లు గానే కనిపించాడు విరాట్ కోహ్లి.  అయితే రెండు మ్యాచ్ లలో బాగా రాణించిన విరాట్ కోహ్లీ ఆ  తర్వాత అదే రీతిలో రాణిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశాడు.


 రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ లాగా దాటిగా ఆడటం విరాట్ కోహ్లీకి  చాతకాదు అంటూ కామెంట్స్ చేశాడు.  విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కోసం పనికిరాడని అతని బ్యాటింగ్ శైలి కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే సరిపోతుంది అంటూ వ్యాఖ్యానించాడు. అతని   స్లో బ్యాటింగ్ కారణంగానే ఐపీఎల్ లో బెంగళూరు జట్టు టైటిల్ గెలవలేకపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆసియా కప్ లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఆరంభంలో మాత్రం కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు.  ఇక ఇదే విషయంపై స్పందిస్తూ  షాకింగ్ కామెంట్స్ చేశాడు  రషీద్ లతీఫ్.


 విరాట్ కోహ్లీ వల్లే ఆర్సిబి ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయింది.  ఎందుకంటే అతని ఇన్నింగ్స్ స్పీడ్ పెంచడం రాదు.. మహేంద్ర సింగ్ ధోనీ కూడా కొన్ని డాట్ బాల్స్  ఆడుతూ ఉండేవాడు. కానీ  తర్వాత కొన్ని సిక్సర్లు కొట్టి  లెక్క సరి చేసే వాడు. కోహ్లీకి  మాత్రం ఇది అస్సలు చేతకాదు. కాబట్టి అతను హాంకాంగ్ పై  ఎలా ఆడాడు  అనే దానిపై  చర్చ అనవసరం అంటూ రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ పవర్ ప్లే  ని బాగా వాడుకున్నాడు.. క్రీజు లో ఉంటే ఎక్కువ సేపు సైలెంట్ గా ఉండడు.  సిక్సెర్ లతో  చెలరేగి పోతుంటాడు. వన్డేలకు కావాల్సిన స్కిల్స్ విరాట్ లో పుష్కలంగా ఉన్నాయి  అంటూ రషీద్ లతీఫ్  వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: