ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో మోస్ట్  సక్సెస్ఫుల్ క్రికెటర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ జట్టులోకి ఆరంగేట్రం చేసిన తిలక్ వర్మ తన టాలెంట్ తో తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.   ఒకవైపు సీనియర్ ఆటగాళ్లు అందరూ కూడా పేలవ ప్రదర్శన చేస్తున్న సమయంలో జట్టు వరుస ఓటములు చవి చూస్తున్న తరుణంలో తన బ్యాటింగ్తో అందరినీ కట్టి పడేసాడు.  ప్రతి మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలో అతనికి టీమిండియాలో చోటు దక్కడం ఖాయమని ఎంతోమంది భావించారు. కానీ యువ ఆటగాడు కావడంతో అతనికి మరి కొంతకాలం పాటు సమయం ఇచ్చారు భారత సెలెక్టర్లు. అయితే ఐపీఎల్ లో ఆడిన అదే జోరును  ఇప్పుడు తిలక్ వర్మ కొనసాగిస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇండియా ఏ జట్టు లో సెలెక్ట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసి కదం తొక్కాడు. న్యూజిలాండ్ ఏ జట్టుతో కొనసాగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించడం గమనార్హం.. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తిలక్ వర్మ  సెంచరీ మార్క్  అందుకున్నాడు.


 మొత్తంగా 121 పరుగులు చేసి అవుట్ అయ్యాడు అని చెప్పాలి. ఇండియా ఏ జట్టు నాలుగో రోజు తన తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తిలక్ వర్మ  అవుట్ అయిన కొద్దిసేపటికే  571 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గమనార్హం. అయితే న్యూజిలాండ్ ఏ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 400 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న జోక్ కార్ట్రన్  195 పరుగులు చేయడం గమనార్హం. ఇందుకు  బదులుగా భారతీయ జట్టు తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులు చేసింది. అయితే తిలక్ వర్మ సెంచరీ సాధించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడని త్వరలో టీమిండియా లోకి వస్తాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: