టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పేరు వింటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే అతను ఓపెనర్ గా వచ్చి సృష్టించిన విధ్వంసం ఆ రేంజ్ లో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తనకు బౌలింగ్ చేస్తున్న బౌలర్ ఎవరైనా సరే సిక్సర్లతో చెలరేగిపోతారు. స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. అందుకే అతనికి హిట్ మ్యాన్ అనే ఒక అరుదైన బిరుదు కూడా వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు రోహిత్.


 ఎన్నో దేశాలపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. సెంచరీలు డబుల్ సెంచరీ ల తో అదిరిపోయే ప్రదర్శన చేసి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలను అందించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ఎప్పుడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే రోహిత్ శర్మ పాకిస్థాన్పై మాత్రం పేలవమైన రికార్డుని కలిగి ఉన్నాడు అన్నది తెలుస్తుంది. దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుపై రోహిత్ శర్మ బుల్లెట్ పేలలేదు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లోనూ 134 మ్యాచ్లు ఆడి 139.8 స్ట్రైక్ రేట్ తో 4 సెంచరీలు 27 హౌస్ సెంచరీలు చేసి 3520 పరుగులు చేసిన రోహిత్ శర్మ పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం 9 ఇన్నింగ్స్ లో  కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగిగాడు.


2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ 30 పరుగులు చేశాడు. ఇప్పుడు వరకు పాకిస్థాన్ జట్టుపై ఈ 30 పరుగులే రోహిత్ అత్యధిక స్కోరు గా కొనసాగుతుంది అని చెప్పాలి. 2007లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రోహిత్ 16 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు చేశాడు. 15 ఏళ్లుగా రోహిత్ ఒక్కసారి కూడా పాకిస్తాన్పై 30 పరుగుల మార్కును చేరలేకపోవడం విచారకరమని చెప్పాలి.పాకిస్థాన్పై వన్డేలో రోహిత్ శర్మ ఒక మంచి రికార్డు ఉంది అని చెప్పాలి. 17 మ్యాచ్ లలో 730 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: