గత కొన్ని రోజుల నుంచి ఫామ్ లో లేడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం మునుపటి ఫామ్ లోకి వచ్చి మళ్ళీ పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ ముందు వరకు కూడా దాదాపు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఇటీవలే ఆసియా కప్ లో భారత జట్టు లో చేరాడు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు హాంకాంగ్  తో జరిగిన మ్యాచ్లో 59 పరుగులు ఇటీవలే టాప్ ఫోర్ లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 60 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి ఫాం అందుకోవటం  పై అభిమానులు అందరూ కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే విషయంపై ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు టీమిండియా. మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. సూపర్ ఫోర్ లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ ప్రశంసించాడు. అయితే వాస్తవానికి విరాట్ కోహ్లీ ఎప్పుడు ఫామ్ లోనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. కానీ అతడి నుంచి మనమే ఎక్కువగా ఆశించాం.. అదే పెద్ద సమస్యగా మారిపోయింది.. అతడు పాము కోల్పోయాడు అనుకునేలా చేసింది అంటూ అభిప్రాయపడ్డాడు.



 ప్రతి సారి కూడా విరాట్ కోహ్లీ శతకం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.. కానీ సెంచరీ చేయకపోవడంతో ఫామ్లో లేడనే వ్యాఖ్యలు వినిపించాయి అని చెప్పుకొచ్చాడు. సచిన్ సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడ లేదా అని చర్చించుకున్నాం.. ఇక విరాట్ కోహ్లీ 40, 50 పరుగుల వద్ద అవుట్ అయితే అది లెక్కలోకి తీసుకోలేదు. అతడు ఫామ్ లో లేడని  భావించాము. కాని కోహ్లీ మాత్రం ఎప్పుడూ ఫాంలో ఉన్నాడు. కానీ మంచి ఆరంభాన్ని భారీ స్కోర్లు గా మలచడంలో విఫలమయ్యాడు.  ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఇన్నింగ్స్ మాత్రం చాలా విలువైనది అంటూ తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: