మొన్నటి వరకు ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ విరాట్ కోహ్లీ ఇటీవలే మళ్లీ మునుపటి ఫామ్ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇకపోతే ఇటీవల పాకిస్థాన్తో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను కెప్టెన్సీ వదిలేసిన సమయంలో తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదు అంటూ వ్యాఖ్యానించాడు. తన నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నప్పటికీ కూడా తనకు ఒక్కరు కూడా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు అంటూ తెలిపాడు. మహేంద్రసింగ్ ధోని ఒక్కడే మెసేజ్ చేశాడు అని విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కాస్త ఇటీవల భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. కాగా ఇటీవలే ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం వాస్తవం లేదని.. కెప్టెన్సీ వదిలేసిన  సమయంలో విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ మండలి నుంచి పూర్తి మద్దతు అందింది.. ఆటగాళ్లు సైతం అండగా నిలిచారు అంట చెప్పుకొచ్చాడు. దీంతో ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి అని చెప్పాలి.


 కెప్టెన్సీ వదిలేసిన సమయంలో నాకు అత్యంత సన్నిహితులు కూడా అండగా నిలవలేదని.. టీవీలో నా గురించి మాట్లాడుతూ సలహాలు ఇచ్చే వారని.. కానీ పర్సనల్ గా నాతో మాట్లాడిన వారు ఎవరూ లేరు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీకి ప్రతి ఒక్కరూ అండగా నిలిచారని.. సహచరులతో పాటు బీసీసీఐ బోర్డులోని అధికారులు కూడా మద్దతుగా ఉన్నారు. సపోర్ట్ ఇవ్వలేదని   తనకు ఎవరూ అండగా లేరని చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని సెలక్టర్లు అతనికి తరచూ రెస్ట్ కూడా ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్సీ వదిలేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో స్పందించారు అంటూ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: