ఇటీవల ఆదివారం సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఎంత చెత్త ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరికి ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆసియా కప్లో భారత జోరుకు కళ్లెం వేసింది పాకిస్తాన్. అయితే సూపర్ 4 ను ఓటమితో ప్రారంభించిన భారత్ ఇక ఇప్పుడు మరో ఆసక్తి కరమైన పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంకతో డు ఆర్ డై మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే.


 భారత జట్టు ఫైనల్ కు వెళ్లాలి అంటే మిగిలిన రెండు మ్యాచ్ లలో తప్పక గెలవడమే కాకుండా భారీ తేడాతో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. టీమిండియా లో మార్పులు ఖాయం అన్నది తెలుస్తుంది. రవీంద్ర జడేజా ఉన్నంతవరకు పటిష్టంగా  కనిపించిన టీమిండియా కాంబినేషన్  అతను  దూరం కావడంతో  చెల్లాచెదురైంది. అయితే ఇటీవల దినేష్ కార్తీక్ ని కాదని పంత్ ను జట్టులోకి తీసుకుంటే అతను అనవసరమైన షాట్ ఆడి భారత్ కొంప ముంచాడు. ఇక దీపక్ హుడా సైతం అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో రిషబ్ పంత్ పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీపక్ హుడాకు బదులు అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవలే బ్యాటింగ్ లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ మాత్రం రాలేదు.  అతడు గాయం బారిన పడ్డాడు అన్న టాక్ ఉంది. ఇదే నిజమైతే దీపక్ హుడాకు కోహ్లీ స్థానంలో జట్టులో చోటు దక్కుతోంది. ఇక ఆవేశ్ ఖాన్ లేదా రవి బిష్ణయ్ జట్టులో కొనసాగుతారు.

భారత తుది జట్టు(అంచనా)
 రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్/దినేశ్ కార్తీక్, దీపక్ హుడా/అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్/ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజువేంద్ర చాహల్.

మరింత సమాచారం తెలుసుకోండి: