ఇండియా క్రికెట్ లో నమ్మదగిన క్రికెటర్ గా ఎదిగిన సురేష్ రైనా ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు అనే విషయం తెలిసిందే..ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో ఇక జట్టు తరఫున అవకాశం దక్కించుకున్న సురేష్ రైనా తన అద్భుతమైన బ్యాటింగ్తో అదర కొట్టాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ఒంటిచేత్తో టీమిండియాకు విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.


 అయితే ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మాత్రం సురేష్ రైనా టీమిండియా  పూర్తిగా దూరమయ్యాడు. ఈ సమయంలో యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో అతనికి కేవలం అడపాదడపా అవకాశాలు మాత్రమే వచ్చాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎవరూ ఊహించని విధంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం గంటల వ్యవధిలోనే సురేష్ రైనా నీ తోనే నా ప్రయాణం అంటూ ఒక ఎమోషనల్ నోట్ రాసి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కొనసాగాడు.. అయితే ఈ ఏడాది జరిగిన మెగా వేలం కారణంగా సురేష్ రైనా మెగా వేలంలోకి వదిలేసింది చెన్నై.దీంతో అతన్ని ఐపీఎల్ లో ఎవరు కొనుగోలు చేయలేదు అని చెప్పాలి. మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్న రైనా కు ఇలాంటి పరిస్థితి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.. తనకు సహకరించిన బిసిసిఐ యూపీ క్రికెట్ అసోసియేషన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం థాంక్స్ చెబుతూ ఒక పోస్ట్. పెట్టాడు అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: