గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టి20 కెప్టెన్సీ వదులుకోవడం దగ్గర నుంచి ఆ తర్వాత బీసీసీఐ అతని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేంత వరకు తర్వాత కొంతకాలానికే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడం ఇలా అన్ని రకాల పరిణామాలు చర్చనీయాంశంగా మారిపోయాయ్. అంతేకాదు ఇక కెప్టెన్సీ నుంచి తప్పించే సమయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత కొన్ని రోజుల నుంచి విరాట్ కోహ్లీ సరైన ఫామ్లో లేకపోవడంతో ఎంతో మంది మాజీ క్రికెటర్ల తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఆసియా కప్లో భాగంగా మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజుల నుంచి తరచూ వార్తల్లో విరాట్ కోహ్లీ నిలుస్తూనే  ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పాకిస్థాన్తో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. టెస్ట్ కెప్టెన్సీ వదిలేసిన సమయంలో తనకు ఎవరు అండగా నిలవలేదని.. విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కేవలం మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని నిజమైన ఆప్తులు అలాగే ఉంటారని తెలిపాడు.


 కానీ కొంతమంది మాత్రం టీవీ ముందు కూర్చొని నాకు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చాడు. తన సహచర ఆటగాళ్లు దగ్గర కూడా తన ఫోన్ నెంబరు ఉన్నప్పటికీ ఎవరూ కనీసం ఒక మెసేజ్ కూడా చేయలేదు విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. అయితే కోహ్లీ వ్యాఖ్యలపై ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. అసలు విరాట్ కోహ్లీ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటూ సూటి ప్రశ్న వేశాడు సునీల్ గవాస్కర్. తనకు మద్దతు కావాలని అనుకుంటున్నాడా అంటూ ప్రశ్నించాడు. అతను కెప్టెన్సీని వదులుకున్నప్పుడు అతనికి మద్దతు ఎందుకు.. పైగా మెసేజ్ చేయని వాళ్ళ పేర్లు బయట పెట్టాలి కదా అంటూ గవాస్కర్  చురకలంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: