గత కొంతకాలం నుంచి మంచి ప్రదర్శన చేస్తున్న రోహిత్ శర్మ రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో టి20 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అంతే కాదు ఇంకా ఎన్నో రికార్డులు కూడా సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు  ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది. ఈ పోరులో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో టీమిండియాపై శ్రీలంక విజయం సాధించింది అనే చెప్పాలి. తప్పక గెలిస్తేనే ఫైనల్లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్న మ్యాచ్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది..


 ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం మొత్తం చేతులెత్తేసిన సమయంలో జట్టు కెప్టెన్ రోహిత్ వర్మ తనదైన శైలిలో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శ్రీలంక బౌలర్లపై సిక్సర్లతో చెలరేగిపోయాడు అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమి చవి చూసినప్పటికీ అటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని తెలుస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మార్టిన్ గప్టిల్ పేరిట ఉన్న 172 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ.


 దీంతో అంతర్జాతీయ టీ20 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రికార్డులు తిరగరాశాడు అని చెప్పాలి. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 72 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేసిన సమయంలో బాధ్యత మొత్తం రోహిత్ శర్మ తీసుకున్నాడు అని చెప్పాలి. ఇక రోహిత్ జోరు చూస్తే సెంచరీ చేయడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కోల్పోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం 173 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా టీ20 లో మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: