ఆసియా కప్లో భాగంగా ఎంతో అదిరిపోయే ప్రణాళికతో వరుస విజయాలు సాధించిన  టీమిండియా జట్టు చివర్లో మాత్రం ఉసూరుమనిపించింది. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సూపర్ 4 లో అడుగుపెట్టిన భారత జట్టు ఇక సూపర్ 4 లో మాత్రం అదే రీతిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఇక పాకిస్థాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో గెలిచి సత్తా చాటిన భారత జట్టు అదే ప్రత్యర్థితో మరోసారి మ్యాచ్ జరిగేసరికి మాత్రం ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి. వరుసగా పాకిస్థాన్ శ్రీలంక చేతిలో ఓడిపోయి చివరికి ఫైనల్ అవకాశాలను ఎంతో క్లిష్టంగా మార్చుకుంది అని చెప్పాలి.



 అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ చివరి వరకు కూడా ఎంతో ఉత్కంఠగా సాగింది అని చెప్పాలి. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో  వికెట్ కీపర్ రిషబ్ పంత్ లంక బ్యాట్స్మెన్ను రనౌట్ చేయడంలో విఫలం అయ్యాడు అని చెప్పాలి. అదే సమయంలో ఓవర్ త్రో కారణంగా కూడా  పరుగు ఎక్కువగా వచ్చింది అని చెప్పాలి. ఇలా టీమిండియా జట్టు చేసిన కొన్ని తప్పిదాల కారణంగానే శ్రీలంక జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.


 తప్పక గెలిస్తేనే ఫైనల్ కి వెళ్తామని  తెలిసినప్పటికీ కూడా టీమిండియా ఇలాంటి ప్రదర్శనలు చేయడం ఏంటి అంటూ అందరూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. రిషబ్ పంత్ స్థానంలో మహేంద్రసింగ్ ధోని ఉండి ఉంటె టీమిండియా  తప్పకుండా గెలిచేది అంటూ చెబుతున్నారు. గతంలో బంగ్లాదేశ్తో మ్యాచ్ జరిగిన సమయంలో సరిగ్గా ఇలాంటి సిచువేషన్ ఎదురైంది. ఇలాంటి సమయంలోనే ధోని ఏకంగా తన చేతికి ఉన్న గ్లోవ్స్ తీసేసి పరిగెత్తుకుంటూ వచ్చి రనౌట్ చేశాడు. ఇది గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ ధోని ఉంటే గెలిచేది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: