గత రాత్రి జరిగిన మ్యాచ్ ను భారత్ అభిమానులు వీలైనంత త్వరగా మర్చిపోవాలని కోరుకుందాం. ప్రస్తుతం యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు ఇండియాను అంతా టైటిల్ ఫేవరెట్ గా భావించారు. దీనికి కారణం పాకిస్తాన్ ఫామ్ లో లేకపోవడం, బరిలో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ లు ఇండియా కన్నా బలమైన టీం లు కాకపోవడం. అయితే టోర్నీ స్టార్ట్ అయింది లీగ్ దశలో బాగా ఆడిన ఇండియా... సూపర్ 8 కు చేరుకోగానే ఏమైందో ఏమో తెలియదు వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. మొదటగా పాకిస్తాన్ చేతిలో ఓడిపోగా, రాత్రి మాత్రం అనూహ్యంగా జట్టు నిండా కుర్రాళ్లతో నిండిన శ్రీలంక చేతిలో చివరకు వరకు పోరాడి ఓడింది.

అయితే ఈ మ్యాచ్ లో ఇండియా చేసిన పరుగులను కాపాడుకోలేకపోయింది. వాస్తవానికి ఇండియా కు దిరికింది స్టార్ట్ కు కనీసం 190 చేయాల్సింది. కానీ చివరి ఓవర్ లలో వరుస వికెట్లను కోల్పోయి సాధారణ స్కోర్ 173 తో సరిపెట్టుకుంది. రోహిత్ ఒక్కడే 72 పరుగులతో ఆకట్టుకున్నాడు. రాహుల్, పాండ్య, పంత్ మరియు హూడా లు మరోసారి విఫలం కాగా, సూర్య మాత్రం పర్వాలేదనిపించాడు. ఇక గత మూడు మ్యాచ్ లుగా ఫామ్ లోకి వచ్చినట్లు కనబడిన కోహ్లీ డక్ అవుట్ గా వెనుతిరిగాడు. సో ఇండియా జట్టు యాజమాన్యం టీమ్ కూర్పు విషయంలో పెద్ద హోమ్ వర్క్ చేయాల్సి ఉంది.

ఇటువంటి టీం తో టీ 20 వరల్డ్ కప్ కు వెళితే గ్రూప్ దశలోనే నిష్క్రమించడం పక్కా అని అభిమానులు మరియు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓటమితో ఇండియా ఆసియా కప్ ఫైనల్ ఆశలు నిర్జీవం అయిపోయాయి. ఇంకేమైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియా ఫైనల్ చేరడం కష్టమే. మరి చూద్దాం ఏమి జరుగుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: