ఆసియా కప్లో భాగంగా వరుసగా రెండు విజయాలు సాధించి ఎంతో జోరు మీద కనిపించిన టీమిండియా ప్రస్థానం  ప్రస్తుతం ముగిసినట్లే కనిపిస్తోంది. లీగ్ దశలో ఉన్న సమయంలో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం సాధించి వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా సూపర్ 4 లో మాత్రం అదే జోరును కొనసాగించ లేక పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూపర్ 4 లో భాగంగా ఆడాల్సిన మూడు మ్యాచ్ లలో ఇప్పటికే రెండు ఆడేసింది. రెండు మ్యాచ్ లలో కూడా ఘోర ఓటమి చవిచూసింది అని చెప్పాలి.


 దీంతో ఇక టీమిండియాకు ఫైనల్ వెళ్లే అవకాశాలు దాదాపు కనుమరుగైపోయాయ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇక టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో అడుగు పెట్టలేదు అని చెప్పాలి. అయితే జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో జట్టులో ఉన్న సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇక బౌలింగ్ విభాగాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఒకరకంగా టీమిండియా పరాజయానికి కారణం గా మారిపోయాడు భువనేశ్వర్ కుమార్.


 ఈ క్రమంలోనే అతని బౌలింగ్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఇటీవలే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ శైలి పై స్పందించిన పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఫేస్ లేదు అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. భువి మంచి బౌలర్ కానీ టీ20ల్లో ఫేస్ లేకపోతే కష్టం. దుబాయ్ లాంటి పిచ్ లపై మీడియం పేసర్ లకు బదులు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బుమ్రా లాంటి వాళ్లను తీసుకోవడం బెటర్   జస్ప్రిత్ బూమ్రా జట్టులో ఉండి ఉంటే టీమిండియా ఎంతో పటిష్టంగా ఉండేది అంటూ పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: