ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు కూడా ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. కీలకమైన పోరులో చివరికి భారత జట్టు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. అయితే చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో అని ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలో చివర్లో సిక్సర్లు ఫోర్ల తో చెలరేగిపోతున్న పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆసిఫ్ ఇచ్చిన సునాయాస మైన క్యాచ్ ని బౌలర్ అర్షదీప్  వదిలేశాడు.  ఇక ఈ అవకాశాన్ని ఎంతగానో సద్వినియోగం చేసుకున్న పాకిస్తాన్ బ్యాట్స్మెన్  జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి.



 అయితే అర్షదీప్ క్యాష్ వదిలేయడం పై సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అర్షదీప్ కారణంగానే భారత జట్టు మ్యాచ్ ఓడిపోయింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మాజీ ఆటగాళ్లు మాత్రం ఒత్తిడిలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం అంటూ అతనికి మద్దతుగా నిలుస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే అర్షదీప్ క్యాచ్  వదిలేయడంపై ఎట్టకేలకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో ట్రోల్ ని అసలు పట్టించుకోము. ప్రస్తుత కాలంలో అయితే మరింత చెత్తగా తయారైంది.  క్రికెట్ లో గెలుపోటములు అనేవి సహజం. కొన్ని సార్లు మనం గెలుస్తే..మరికొన్ని సార్లు  ప్రత్యర్థులు విజయం సాధిస్తారు. ఇక ఒత్తిడి  సమయంలో క్యాచ్ లను  నేలపాలు చేస్తుంటారు. ఇలాగే అర్షదీప్ క్యాచ్ వదిలేశాడు. అయితే దానికి చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. అంతే కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. అతను పాకిస్థాన్తో మ్యాచ్లో శ్రీలంక తో మ్యాచ్ లో అద్భుతమైన బంతులను సంధిస్తూ  పరుగులు కట్టడి  చేశాడు. అందుకే ప్రస్తుత కాలంలో మానసికంగా బలంగా లేకపోతే ఎంతో కష్టమవుతుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: