ఆసియా కప్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 14 సార్లు జరిగింది. ప్రస్తుతం 15 వ ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగుతోంది, ఇది కూడా తుదిఘట్టానికి చేరుకుంది. అయితే ఇందులో ఇండియా ఆరు సార్లు ఆసియా కప్ టైటిల్ ను ఎగరేసుకుపోగా, శ్రీలంక 5 సార్లు మరియు పాకిస్తాన్ 3 సార్లు విజేతగా నిలిచాయి. కాగా ఈ ఆసియా కప్ లో విజేతగా ఎవరు నిలువనున్నారు అన్న ప్రశ్నకు టోర్నీ మొదట్లోనే ఇండియానే అని వినిపించింది. కానీ సూపర్ 8 లోనే మొత్తం తలక్రిందులు అయిపోయింది. ఇండియా వరుసగా రెండు కీలక మ్యాచ్ లు ఓడిపోయి లీగ్ నుండి నిష్క్రమించింది.

దానితో టైటిల్ బరిలో నుండి ఇండియా సైడ్ అయిపోయింది. ఇక రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పాక్ తో ఓడిపోవడంతో ఆఫ్ఘన్ కూడా లీగ్ నుండి అవుట్ అయింది. ఇక ప్రస్తుతం ఫైనల్ కు అర్హత సాధించిన శ్రీలంక మరియు పాకిస్తాన్ లలో ఒక్కరు మాత్రమే విజేతగా నిలవనున్నారు. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. కాగా ఈ కప్ ను గెలుచుకునే వారు ఎవరు అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ లీగ్ లో ఇప్పటి వరకు ఈ రెండు టీం లు చేసిన ప్రదర్శన బట్టి చూస్తే శ్రీలంక గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లంక టీం సమిష్టిగా ఆడుతూ టైటిల్ లక్ష్యంగా దూసుకుపోతోంది. అలా అని పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయలేము. పాక్ టీం లో అందరూ మ్యాచ్ విన్నర్లు కావడం గమనార్హ.... దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గత రాత్రి జరిగిన మ్యాచ్ ఆఖరి వికెట్ కు 11 పరుగులు చేయాల్సిన దశలో స్పీడ్ బౌలర్ నసీం షా రెండు వరుస సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను ఆఫ్ఘన్ చేతిలో నుండి లాగేసుకున్నాడు. కాబట్టి పాక్ ఏ స్థితిలో అయినా డేంజర్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎవరు ఆసియా కప్ టైటిల్ ను గెలుచుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: