ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా జట్టు చివరికి నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే.  ఎట్టిపరిస్థితుల్లో కప్పు గెలిచి తీరుతుంది అనుకున్న జట్టు చివరికి ఫైనల్ లో అడుగు పెట్టకుండానే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ నమ్మకం పెట్టుకున్నట్లు గానే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా జట్టు సూపర్ ఫోర్ లో అడుగుపెట్టింది. కీలకమైన రెండు మ్యాచ్ లలో మాత్రం ఓడిపోయి చివరికి ఇంటి దారి పట్టే పరిస్థితి తీసుకువచ్చింది.



 పాకిస్తాన్, శ్రీలంక చేతిలో పేలవ ప్రదర్శనతో ఓడిపోయింది భారత జట్టు.. దీంతో టీమిండియా ఫైనల్ వెళ్లే అవకాశాలు గల్లంతయ్యాయి. టీమిండియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. రోహిత్ ఎదో సాధిస్తాడని కెప్టెన్ను చేస్తే ఆసియా కప్లో ఇలా నిరాశ పరుస్తున్నాడా అని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మాస్టర్ మైండ్ అని పేరున్న రాహుల్ ద్రవిడ్ కూడా ఏమీ చేయలేక పోయాడు అంటూ హెడ్ కోచ్ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు అనే చెప్పాలి. క్రికెట్ అన్న తర్వాత  గెలుపు ఓటములు సహజమని వాటి గురించి ఆలోచించకుండా ఆడుతూ ముందుకు సాగుతున్నామని అంటూ రోహిత్ శర్మ స్పందించాడు.


 ఇటీవలే కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా క్రికెట్ లో నా పాత్ర ఏంటో అన్న విషయం నాకు స్పష్టం గా తెలుసు. జట్టుకు, కెప్టెన్ కి మద్దతుగా నిలిచి ఆటగాళ్లలో ప్రతిభను వెలికి తీయడం లో సహాయ పడతాను. ఇక మైదానం లోకి దిగిన తర్వాత కెప్టెన్ ఆటగాళ్లు వారి ప్రణాళికలను అమలు చేస్తారు. ఆసియా కప్లో వైఫల్యం తో మా జట్టు భయంకరమైనదిగా చూడాల్సిన పనిలేదు. గెలిచిన ఓడిన ఒకే విధంగా ముందుకు వెళుతుంటాము అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: