ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసిసి టీ20 వరల్డ్కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాదికి టి20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వబోతోంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కూడా సంసిద్ధం  అయిపోయాయి. తన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొవాలి అనే విషయంపై తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అన్ని జట్లకు కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..


 ఈ వార్మప్ మ్యాచ్లో ప్రదర్శనలను బట్టి ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఏ జట్టు ఎలా రాణిస్తోంది అనే ఒక అంచనాకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వార్మప్ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ను ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రిలీజ్ చేసింది.. ఇందులో భాగంగా మొత్తం 16 జట్లు వార్మప్ మ్యాచ్లో ఆడుతున్నాయి. ఇక టీమ్ ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.  అక్టోబర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. తర్వాత ఒక రోజు విశ్రాంతి తీసుకుంటుంది. ఇక అక్టోబర్ 19వ తేదీన న్యూజిలాండ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది..


 అయితే ఇలా వార్మప్ మ్యాచ్ లను అధికారిక మ్యాచులు గా గుర్తించరు అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 వ తేదీన ప్రారంభం కాబోతోంది. ఇక తొలి మ్యాచ్ శ్రీలంక నమీబియా మధ్య జరగబోతుంది.  ఈ క్రమంలోనే ఈ టోర్నిలో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అక్టోబర్ 24వ తేదీన తలపడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ తో పాటు మరో రెండు జట్లను కూడా టీమిండియా ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఆసియా కప్లో నిరాశపరిచిన ఇండియా వరల్డ్ కప్ లో బాగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: