ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ క్రికెటర్లు ఎవరు ఊహించని విధంగా తమ అంతర్జాతీయ  క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండటం అభిమానులందరికీ కూడా షాక్కి గురి చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది క్రికెటర్లు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘమైన ఫార్మట్ గా పేరున్న టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అదేసమయంలో మరికొంతమంది క్రికెటర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్ ఫార్మాట్లో కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు అని చెప్పాలి.


 ఏది ఏమైనా స్టార్ క్రికెటర్ గా  కొనసాగుతూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఇక రిటైర్మెంట్ ఆలోచన చేస్తూ చివరికి ఎంతో మంది షాక్  క్రికెటర్లు అభిమానులకు షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. గతంలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపి అందరికీ షాకిచ్చాడు.  బెన్ స్టోక్స్ ఏంటి రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటి అని అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.


 ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ గా కొనసాగుతున్న ఆరోన్ ఫించ్. గత కొంత కాలం నుంచి ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే దిగ్గజ ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షలా ఉన్నటువంటి వరల్డ్ కప్ లో కూడా ఇతని సారథ్యంలోనే చివరి ఏడాది విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు. కాగా ఇప్పుడు ఇక వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు న్యూజిలాండ్తో జరుగబోయే చివరి వన్డే తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. టి-20లో మాత్రం కొనసాగుతాను అంటూ తెలిపాడు. అయితే టి20లకు కెప్టెన్గా కంటిన్యూ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన కెరీర్లో 145 వన్డేలు ఆడిన ఫించ్ 54 వన్డేలకు సారథిగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: