నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు. భారత్లో ఒక్కసారిగా  సూపర్ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు అనే చెప్పాలి. కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ టోక్యో ఒలంపిక్స్ లో జావలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. అయితే విజయవంతమైన ప్రస్థానాన్ని కేవలం టోక్యో ఒలింపిక్స్ తో మాత్రమే ఆపలేదు. ఏ టోర్నీలో పాల్గొంటే ఆ టోర్నీలో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

 టోక్యో  ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ఆ తర్వాత వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో  సిల్వర్ మెడల్ సాధించి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక నీరజ్ చోప్రా పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఏ టోర్నీలో పాల్గొన్నప్పటికీ ఇక విజేత గా నిలుస్తూ సత్తా చాటుతూ ఉండటం చూస్తూ ఉంటే భారతీయులందరూ మరింత గర్వపడుతున్నారు అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవలే అద్భుతమైన ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రా  డైమండ్ లీగ్ ఫైనల్స్కు చేరుకున్నాడు.  అంతేకాదు డైమండ్ ఫైనల్స్ విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా కూడా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.


 కాగా ఇటీవల తన ప్రదర్శన పై స్పందించిన నీరజ్ చోప్రా తన ప్రదర్శన పట్ల సంతృప్తి  వ్యక్తం చేశాడు. డైమండ్ లీగ్ లో భాగంగా 88.44 మీటర్లు త్రో విసిరిన నీరజ్ చోప్రా 90 మీటర్ల మార్క్ అందుకోనందుకు నిరుత్సాహంగా లేదు అంటూ చెప్పుకొచ్చాడు . ఏదో ఒక రోజు తప్పకుండా 90 మీటర్ల దూరం అనుకుంటానని ఆ రోజు దగ్గరలోనే ఉంది అంటూ తెలిపాడు. అయితే 90 మీటర్ల విసిరినప్పటికీ గెలవకపోతే ఉపయోగం ఉండదని గెలిచేందుకు ఎంత దూరం కావాలో అంత దూరం విసిరితే చాలు అంటూ చెప్పుకొచ్చాడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: