సాధారణంగా వికెట్ కీపర్ లు బౌలింగ్ చేయడానికి అంతగా సాహసం చేయరు . కొంత మంది మాత్రం ఇలా వికెట్ కీపింగ్ చేస్తూనే మరోవైపు బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఆడమ్ గిల్క్రిస్ట్,రాహుల్ ద్రవిడ్,మార్క్ బౌచర్, కుమార సంగక్కర, బ్రెండన్ మెక్ కల్లమ్ లాంటి ఎంతో మంది వికెట్-కీపర్ లు తమ కెరియర్లో  బౌలింగ్ చేసిన దాఖలాలు మాత్రం అస్సలు లేవు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ, ఎబి డివిలియర్స్ లాంటి వికెట్ కీపర్లు అప్పుడప్పుడు బౌలింగ్  చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు తమ బౌలింగ్తో వికెట్లు పడగొట్టడం కూడా చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.



 ఇక ఇప్పుడు ఇలాంటిదే చేసి దినేష్ కార్తీక్ సైతం అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఏకంగా 18 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఎప్పుడూ బౌలింగ్ జోలికి వెళ్లని దినేష్ కార్తీక్ ఇటీవలే తొలిసారి బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు అని చెప్పాలి. ఇందుకు  సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 102 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ మొత్తానికి విరాట్ కోహ్లీ 122 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేయడం హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే ఆఫ్ఘనిస్తాన్ తో భారత విజయం లాంఛనం అవడంతో కెప్టెన్ కె.ఎల్.రావు సరదాగా దినేష్ కార్తీక్ చేతికి బౌలింగ్ ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్ వేసిన దినేష్ కార్తీక్ 18 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. దినేష్ కార్తిక్ కి బ్యాట్స్మెన్లు భారీ షాట్లు ఆడారు. దీంతో కీపింగ్ లో అదరగొట్టే దినేష్ కార్తీక్ బౌలింగ్ ఎలా వేయాలో తెలియక బాగా తికమక పడిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కార్తీక్ బౌలింగ్ చేస్తుంటే రిషబ్ పంత్ కీపింగ్ చేశాడు.  ఇక దినేష్ కార్తీక్ బౌలింగ్ పై రిషబ్ పంత్ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్  లో వైరల్ గా  మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: