ఇటీవల కాలంలో భారత పురుషుల జట్టు విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో అద్భుతంగా రాణిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. అయితే పురుషుల క్రికెట్కు ఎక్కడ తీసిపోని విధంగా మహిళా క్రికెటర్లు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా భారతం మహిళల జట్టు అద్భుతంగా రాణించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రత్యర్థిలు జట్టు అందర్నీ కూడా ఓడిస్తూ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మొదటి బంగారు పతకం సాధించిన జట్టుగా భారత్ నిలుస్తుందని అందరూ అనుకున్నారు.


 కానీ కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది భారత మహిళల జట్టు. దీంతో సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది అని చెప్పాలి. ఆస్ట్రేలియా చేతిలో ఓడిన చోటే భారత మహిళల జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్ పై గెలిచేందుకు సిద్ధమైంది. 3 టీ20 సిరీస్ లో భాగంగా మహిళల జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధం అయింది. ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగబోతుంది. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న హర్మన్ ప్రీత్ సేన ఫినిషింగ్ లోపాలతో బంగారం లాంటి అవకాశాలు చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే.



 బ్యాటింగ్లో అప్పటివరకు మెరుపులు మెరిపించిన  భారత క్రీడాకారిణులు ఇక కీలకమైన మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్లో చేతులెత్తేయడం ఐసిసి ఈవెంట్లలో పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని గతంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. కామన్ వెల్త్ గేమ్స్ లో బాగా ఆడాము. కానీ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది అంటూ కెప్టెన్ చెప్పుకొచ్చింది. నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. రాత్రి పదకొండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: