ఇటీవల ఆసియా కప్  లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా భారత జట్టు బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక 101 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై భారీ విజయాన్ని సాధించింది టీమిండియా.. ఒక వైపు భాగంలో విరాట్ కోహ్లీ 122 పరుగులతో సెంచరీ చేసి అదరగొడితే.. మరోవైపు బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగిపోయి అటు ఆఫ్ఘనిస్తాన్ పరాజయాన్ని శాసించారు  అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఇప్పటివరకు తన కెరీర్లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో మాత్రం ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.  ఈ క్రమంలోనే ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో తన టి20 కెరీర్ లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. అయితే తమ జట్టు పైనే సెంచరీ చేసిన బ్యాట్స్మన్ ను ప్రత్యర్ధి ఆటగాళ్లు అభినందించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రషీద్ ఖాన్ కోహ్లీ సెంచరీ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 సాధారణంగా రషీద్ ఖాన్ విరాట్ కోహ్లీ మధ్య మంచి స్నేహ బంధం ఉంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ద్వారా రషీద్ఖాన్ ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మైదానంలో... మైదానం బయట కూడా ఎంతో ఫ్రెండ్లిగా ఉంటాడు రషీద్ ఖాన్. కాగా.. ఆసియా కప్ లో నా దేశం తరఫున ఆడటం ఎప్పటికీ గర్వకారణమే.. మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ఇక విరాట్ కోహ్లీ కి అభినందనలు. అంతర్జాతీయ టీ20 లో తొలి సెంచరీ చేయడం ఒక అద్భుతం. ఫైనల్ కి వెళ్ళిన శ్రీలంక పాకిస్తాన్ లకు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: