ఎన్నో రోజుల నుంచి  టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. అవసరమైనప్పుడు బౌలింగ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ లో కూడా తన దైన శైలిలో రాణిస్తూ తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రవీంద్ర జడేజా జట్టులో ఉన్నాడు అంటే చాలు చివర్లో మెరుపులు మెరిపించడం  ఖాయమని అభిమానులు కూడా నమ్ముతూ  ఉంటారు అని చెప్పాలి. ఆ రేంజ్ లో తన ఆటతీరుతో గుర్తింపు సంపాదించుకున్నాడు రవీంద్ర జడేజా. అయితే ఆసియా కప్లో భాగంగా రవీంద్ర జడేజా అనూహ్యంగా మోకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.


 ఇక ఇటీవలే అతని మోకాలికి శస్త్రచికిత్స కూడా అయింది అని చెప్పాలి. శస్త్రచికిత్స నేపథ్యంలో అతనికి ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు నిర్ధారించారు తెలుస్తోంది. ఒకవైపు ఆసియా కప్ కు దూరమైన రవీంద్ర జడేజా అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కూడా అందుబాటులోకి రావడం సందేహంగానే మారింది. ఇదే నిజమైతే మాత్రం టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది అని చెప్పాలి. అయితే రవీంద్ర జడేజా సీరియస్గా మ్యాచ్ ఆడుతూ గాయపడలేదు. సరదాగా సాహస క్రీడలకు ప్రయత్నించి గాయపడ్డాడు.


 దుబాయ్ సముద్ర తీరంలో స్కై బోర్డుపై విన్యాసాలు చేయబోయిన రవీంద్ర జడేజా జారి పడటంతో మోకాలికి గాయం అయింది. అయితే ఈ విషయంపై అటు బీసీసీఐ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక కాంట్రాక్ట్ ప్లేయర్ అయ్యుండి మైదానం బయట ఆట తో సంబంధం లేని చోట గాయపడటం ఏంటి అంటూ రవీంద్ర జడేజాను ప్రశ్నించారట.  సరదా కోసం చేసిన పని టీమిండియాకు ఎన్నో కష్టాలను తెచ్చి పెట్టింది అంటూ అధికారులు రవీంద్ర జడేజా కు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఏమైనా రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ లేకపోవడం టీమ్ ఇండియాకు పెద్ద లోటు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: