సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్టును గెలిపించే క్రమంలో బౌలింగ్ విషయంలో ఫీల్డింగ్ విషయంలో బ్యాటింగ్ విషయంలో ఆటగాళ్లు ఎంతో  అగ్రిసీవ్ ఉంటారు. ఇలాంటి సమయంలో కాస్త రిస్కు చేయడం చేస్తూ ఉంటారు. తద్వారా గాయాల బారిన పడుతూ ఉంటారు.  ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆటగాడి కెరియర్లో గాయాలు ఒక భాగమే అని చెప్పాలి.  ఇక ఇటీవలే ఆసియా కప్లో టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం గాయం కారణంగా జట్టును కష్టాల్లో పడేసాడు.


 అయితే ఆసియా కప్లో ప్రేక్షకులు చూసినంత వరకూ అతడు రిస్కీ ఫీట్స్ ఎక్కడ చేయలేదు. కానీ పాకిస్తాన్  తో మ్యాచ్ ముందు మాత్రం జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు అని బీసీసీఐ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత క్రికెట్ కు సంబంధం లేని ఆట ద్వారా గాయపడినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్తాన్ తో మ్యాచ్ కి ముందు టీమిండియా మేనేజ్మెంట్ నిర్వహించిన అడ్వెంచర్ యాక్టివిటీస్ లో భాగంగా సముద్ర తీరంలో స్కెట్ బోర్డుపై విన్యాసాలు చేయబోయాడు రవీంద్ర జడేజా. ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. తద్వారా గాయం కావడం చివరికి సర్జరీ వరకు వెళ్లడం జరిగింది.


 కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం  ఉంది. తద్వారా టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అయితే ఇలా ఆట తో సంబంధం లేకుండా భారత క్రికెటర్లు గాయపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన యువరాజ్ సింగ్ సైతం ఇలాగే టోర్నీ ముందు గాయపడ్డాడు. 16 ఏళ్ల క్రితం 2006లో భారత వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇక మ్యాచ్కి ముందు కోకో ఆడుతూ మోకాలి గాయం బారిన పడ్డాడు. అతడు ఐదు నెలల పాటు విశ్రాంతి తీసుకుని జట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక జడేజా లేని లోటు కనిపించినట్లుగానే అప్పుడు యువరాజ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: