ఆసియా కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా చివరికి అందరినీ నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో టీమిండియా కు చేదు అనుభవం ఎదురైంది. వరుసగా లీగ్ దశ మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించింది. ఆ తర్వాత సూపర్ 4లో మాత్రం శ్రీలంక పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో  ఘన విజయం సాధించినప్పటికీ ఇక ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పాలి. ఫైనల్లో అడుగుపెట్టకుండా ఇంటిముఖం పట్టింది టీమిండియా జట్టు.


 ఇదే విషయంపై ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు అని చెప్పాలి. టీమిండియా సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడం వల్లే విజయం సాధించలేకపోయింది అంటూ ఎంతోమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్ లలో ప్రయోగాలు చేస్తే పర్వాలేదు. కానీ  ఆసియా కప్ టోర్నీలో కూడా ప్రయోగాలు చేయడం ఏంటి అంటూ రోహిత్ శర్మ పై దుమ్మెత్తి పోస్తున్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్సర్కార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 టీమిండియా ఎప్పుడూ జట్టు కూర్పులో పలు మార్పులు చేసుకుంటూ పోయింది. దినేష్ కార్తీక్ ను జట్టుకు ఎంపిక చేసిన అతను ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాలేదు. రవిచంద్రన్ అశ్విన్ ను కూడా మొదటిసారి శ్రీలంకతో ఆడే అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్ కోసం ఉత్తమ ఎలెవెన్ జట్టును గుర్తించే పనిలో భాగంగా ఇలా చేశారని తెలుస్తుంది. కానీ ఆసియా కప్ టోర్నీ కూడా ముఖ్యమే కదా. ఆసియా ఒక పెద్ద టోర్నమెంట్ అని దిలీప్ వెంగ్సర్కార్ వ్యాఖ్యానించాడు. ఇక ఇలాంటి తరుణంలో మ్యాచ్ గెలవడం జట్టు నైతికతకు చాలా ముఖ్యం. అలాగే విన్నింగ్ కాంబినేషన్ కలిగి ఉండటం కూడా ఎంతో ముఖ్యం.. ద్వైపాక్షిక సిరీస్ లలో ఎన్ని ప్రయోగాలు చేసినా పర్వాలేదు. కానీ ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ప్రయోగాలు చేస్తే మాత్రం జట్టుకే ప్రమాదం అంటూ దిలీప్ వెంగ్సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: