ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బాగా రాణిస్తుంది అని అందరూ భావించారు. ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఇంగ్లండ్ గడ్డపై ఏకంగా ఇంగ్లాండ్ జట్టును ఓడించింది భారత మహిళల జట్టు. ఇప్పుడు ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న సిరీస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తుందని అందరూ భావించారు. టీ20 సిరీస్ లో భాగంగా ఇటీవలే మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా జట్టు ఘోరపరాభవం పాలు అయింది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.


 అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి  13 ఓవర్లలో 134 పరుగులు చేసి విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లో ఓటమిపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి.  మ్యాచ్ ఆడేందుకు పరిస్థితులు సరిగా లేవని... అయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. బ్యాటింగ్ చేసినప్పుడు అనుకున్న విధంగా మేం పరుగులు చేయడంలో విఫలమయ్యాము. అయితే ఆడేందుకు పరిస్థితులు 100% పెద్దగా లేవు.


 ఈ క్రమంలోనే జట్టును గెలిపించేందుకు తమ జట్టు ప్లేయర్లు ఎంతగానో కష్టపడ్డారు. కానీ అది కుదరలేదు.. అయితే ఇలాంటి పిచ్ పైన  132 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు.. ఇక మా జట్టు ఆటతో సంతోషంగానే ఉన్నాను అంటూ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.  ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు  మాత్రం 100% పరిస్థితులు అనుకూలంగా లేవని ఇప్పటికికూడా నమ్ముతున్నాం.. మొత్తం తడిగానే  ఉంది. క్రికెటర్లు గాయపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది.  కాగా ఇదే మ్యాచ్ లో రాధా యాదవ్ రెండో ఇన్నింగ్సులో రెండో ఓవర్లోనే గాయపడి చివరికి మైదానం వీడాల్సి వచ్చింది అనే విషయం తెలిసిందే.  కీలక బౌలర్ లేకపోవడం కూడా జట్టుకు లోటు గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: