ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వచ్చిన ఆసియా కప్లో భాగంగా ఇటీవల ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజా అందించింది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంక  పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ నిజంగా పైసా వసూల్ మ్యాచ్ గా మారిపోయింది. కాగా చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఊహకందని విధంగా మారిపోయింది.


 ఇలాంటి సమయంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రేక్షకులను మునివేళ్ళపై నిలబెట్టిన మ్యాచ్లో చివరికి పాకిస్థాన్పై శ్రీలంక జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చి ఆసియా కప్ విజేత గా శ్రీలంక జట్టు నిలిచింది  అని చెప్పాలి. అయితే ఒకానొక సమయంలో పాకిస్థాన్ జట్టు ఎంతో సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఊహించని రీతిలో పాకిస్తాన్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాల కారణంగా చివరికి జట్టుకు ఓటమి తప్పలేదు అని చెప్పాలి.  ముఖ్యంగా కీలకమైన క్యాచ్ వదిలేయడం పై పాకిస్తాన్ జట్టు ఆటగాడు షాదాబ్ ఖాన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


 ఇటీవల తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తాడు పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్. ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఓటమికి తనదే పూర్తి బాధ్యత అంటూ మీడియా వేదికగా తెలిపాడు. సాధారణంగా ఏ జట్టు అయినా సరే మ్యాచ్ గెలవడం లో క్యాచ్ లు కీలకం కానీ క్షమించండి నేను జట్టును నిరాశపరిచాను. జట్టు మొత్తం మంచి ప్రదర్శన చేసింది అంటూ సోషల్ మీడియాలో తెలిపాడు. ఆసియ కప్ గెలిచిన శ్రీలంక కు అభినందనలు తెలిపాడు షాదాబ్ ఖాన్. కాగా శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో లంక బ్యాట్స్మెన్ కొట్టిన భారీ షాట్ ని ఆసిఫ్ అలీ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా సమన్వయ లోపం కారణంగా షాదాబ్ ఖాన్  కూడా పరిగెత్తుకు వచ్చి క్యాచ్ పట్టెందుకు ప్రయత్నించి ఆసిఫ్ అలీనీ ఢీకొట్టాడు. దీంతో సరిగ్గా చేతిలో పడింది అనుకున్న క్యాచ్ కాస్త బౌండరీ అవతల పడటంతో సిక్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: