అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు విరాట్ కోహ్లీ. ఉత్తమమైన ప్రదర్శనతో ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో తనకు తిరుగు లేదు అని నిరూపించాడు.  ఎంతోమందికి  సాధ్యంకాని రికార్డులను కూడా విరాట్ కోహ్లీ సాధించాడు అని చెప్పాలి.. అయితే విరాట్ కోహ్లీ తర్వాత మంచి ప్రదర్శన చేసే క్రికెటర్ ఎవరు అంటే పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజాం పేరు చెబుతూ ఉంటారు ఎంతోమంది విశ్లేషకులు. వీరిద్దరి ఆట తీరును కూడా ఎప్పుడూ పోలుస్తూ వుంటారు అని చెప్పాలి.


 అయితే మొన్నటి వరకు విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు అని చెప్పాలి.  ఇలాంటి సమయంలోనే మంచి ఫాం కనబరిచిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం విరాట్ కోహ్లీ సాధించిన ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. అంతే కాదు విరాట్ కోహ్లీ నెంబర్ వన్ పొజిషన్ను కూడా అతని నుంచి లాక్కుని ఎక్కువ కాలం పాటు అదే పొజిషన్లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు వీరిద్దరికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంటుంది.  అయితే విరాట్ కోహ్లీ బాబర్ అజాం లలో  ఎవరు మీకు ఇష్టమైన క్రికెటర్ అనే శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయసూర్య ని అడిగితే కోహ్లీ వైపే మొగ్గు చూపాడు అని చెప్పాలి.


 తనతో పాటు తన కుమారుడికి కూడా కోహ్లీ ఆట అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.  కోహ్లీ ఆటను ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉంటాను అంటూ చెప్పాడు. పాకిస్తాన్ జట్టు కోచ్ సక్లైన్ ముస్తాక్ కూడా బాబర్ అజాం ఎంపిక చేసుకున్నప్పటికీ తన హృదయానికి దగ్గరైన ఆటగాడు విరాట్ కోహ్లీ అంటూ వెల్లడించాడు. కాగా ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ కెరీర్లో 102 టెస్టులు 262 వన్డేలు 104 టి20 మ్యాచ్లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని 71 శతకాలు 24 వేల రెండు పరుగులు చేశాడు.బాబర్ అజాం 42 టెస్ట్ లు, 92 వన్డేలు, 79 టి20 లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. పది వేల ఐదు వందల ముప్పై ఐదు పరుగులు మాత్రమే చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: