ఇటీవలే ఆసియా కప్లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. సిరీస్లో ఆతిథ్య జట్టుపై కూడా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టు ఎంతో పటిష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే ఆసియా కప్లో కూడా భారత జట్టుకు తిరుగులేదు అని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో భారత జట్టుకు ఆసియా కప్లో ఊహించని రీతిలో నిరాశే ఎదురైంది అని చెప్పాలి.


 కీలక మ్యాచ్ లో ఓడిపోవడంతో చివరికి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. ఇలాంటి సమయంలో ఇక అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ పైనే అందరి దృష్టి ఉంది. ఇక టీమిండియా నిరాశపరిచిన నేపథ్యంలో ఇక జట్టులో కీలకమైన మార్పులతో ఎంతో పటిష్టమైన జట్టుతో టీమిండియా వరల్డ్ కప్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ టీమ్ ఇండియా జట్టు లో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.


 గాయం బారినపడి జట్టుకు దూరమైన జస్ప్రిత్ బూమ్రా, హర్షల్ పటేల్  జట్టులో చేరారు అనేది తెలుస్తుంది. ఇద్దరితో పాటు ఆరో బౌలర్ హార్దిక్ పాండ్యాను కూడా తీసుకుంటే టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడతాడని ఇటీవలే మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇద్దరు బౌలర్ల తోపాటు అర్షదీప్ సింగ్, ఆల్ రౌండర్ దీపక్ చాహర్ జట్టులోకి తీసుకోవాలని సూచించారు. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ బుమ్రా బౌలింగ్ చేస్తే మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడు. టి20 లలో అద్భుతమైన ఫామ్లో ఉన్న దీపక్ చాహర్ కూడా జట్టులో ఉంటే టీమిండియాకు  తిరుగు ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: