సాధారణంగా ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నిలలో ప్రతి ఆటగాడు కూడా బాగా రాణించాలి  అని భావిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కెరీర్లోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలి అని అనుకుంటూ ఉంటాడు.  కొన్నిసార్లు మాత్రం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న విధంగా మారిపోతూ ఉంటుంది ఆటగాళ్ల పరిస్థితి. భారీగా పరుగులు చేయాలి అనే ఉద్దేశంతో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్లు పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి.


 ఇక ఇలా ఆటగాళ్లు ఎవరైనా సరే గోల్డెన్ డక్ ఔట్   గా వెనుదిరిగారు అంటే చాలు వారి పై సోషల్ మీడియాలో ఎంతలా విమర్శలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది కీలకమైన ఫైనల్ మ్యాచ్లో గోల్డెన్ డక్ అవుట్ అయితే ఇక ఈ విషయంపై నెటిజన్లు రచ్చ చేస్తూ ఉంటారు. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ పోరులో చివరికి శ్రీలంక జట్టు 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీలంక జట్టు  పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఇక ఇలాంటి సమయంలోనే శ్రీలంక బ్యాట్స్మెన్ కుషాల్ మొండిస్ మాత్రం గోల్డెన్ డక్ ఔట్ గా వెనుదిరగడం పై విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  అదే సమయంలో అతను అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి  అరంగేట్రం  చేసిన నాటి నుంచి చూసుకుంటే అంతర్జాతీయ మ్యాచ్ లలో అతనికి 26వ గోల్డెన్ డక్  కావడం గమనార్హం.  ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగిన  క్రికెటర్ల జాబితాలో కుషాల్ మొండిస్   రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.  ఈ లిస్టులో తొలిస్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో తొలి స్థానంలో ఉన్నాడు.  ఇక వీరిద్దరి తర్వాత 25 గోల్డెన్ డక్ లతో   మోయిన్ అలీ మూడవ స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: