గత కొంత కాలం నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఇక తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపిస్తూ విజయాన్ని అందిస్తున్నారు శిఖర్ ధావన్. మరోసారి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకోబోతున్నాడా అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే మొన్నటికి మొన్న జింబాబ్వే టూర్కు కూడా కెప్టెన్గా ఎంపికయ్యాడు శిఖర్ ధావన్. కానీ చివరి నిమిషంలో కె.ఎల్.రాహుల్  అందుబాటులోకి రావడంతో అతనికి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ.


 అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఆసియా కప్ లో నిరాశ పరిచిన భారత జట్టు వరల్డ్ కప్ లో మాత్రం అద్భుతంగా రాణించాలి అనుకుంటుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి ముందు టీమ్ ఇండియా కొన్ని సిరీస్ లు ఆడుతుంది.  దీంతో వరల్డ్ కప్ కి ముందు వన్డేలు ఉండటం సరికాదని షెడ్యూల్ ప్రకారం వన్డే సిరీస్ జరుగుతుందని బీసీసీఐ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్ లతోపాటు టి20 ప్రపంచకప్కు వెళ్లబోయే ఆటగాళ్లు అందరిని కూడా  జట్టు నుంచి తప్పించి విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది అంటూ చెప్పుకొచ్చారు.


 ఇక తద్వారా మళ్లీ శిఖర్ ధావన్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అన్నది సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు. ఈ నెల 28 నుంచి సౌతాఫ్రికా భారత్లో పర్యటించనుంది.  ఇందులో భాగంగా భారత 3 టి20 లు అలాగే మూడు వన్డేలు ఆడబోతుంది. టి20 మ్యాచ్ లో సెప్టెంబర్ 28వ తేదీన తిరువనంతపురంలో జరుగుతుంది. గౌహతి, ఇండోర్ లలో  మిగతా 2 టీ20 మ్యాచ్  లు జరుగుతాయి.   అక్టోబర్ 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. లక్నో రాంచి ఢిల్లీ వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. మరి ఈ సిరీస్లో టీమిండియా ఎలా రాణిస్తుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: